Rakhi Sawant- Adil Khan: హీరోయిన్ రాఖీ సావంత్-ఆదిల్ ఖాన్ ల వ్యవహారం బాలీవుడ్ ని ఊపేస్తోంది. భర్త ఆదిల్ ఖాన్ ని రాఖీ సావంత్ అరెస్ట్ చేయించారు. ఆదిల్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అంధేరి కోర్టులో హాజరుపరిచారు. ఆదిల్ ఖాన్ తను అనే అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడనేది రాఖీ సావంత్ ప్రధాన ఆరోపణ. మీడియా ముందు రాఖీ సావంత్ పలుమార్లు బరస్ట్ అయ్యారు. ఆదిల్ ఖాన్ తనుతో ఎఫైర్ నడుపుతున్నాడు. ఈ వ్యవహారం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి తప్పుడు పనులు మానుకోవాలని నేను హెచ్చరించాను. ఇకపై ఆ అమ్మాయిని వదిలేస్తాను. తన నెంబర్ బ్లాక్ చేస్తున్నానని నాతో చెప్పాడు.
ఆదిల్ ఖాన్ ఒక అబద్దాల కోరు. ఖురాన్ మీద ఒట్టేసి ఇకపై తప్పు చేయను అన్నాడు. తన మాట నిలబెట్టుకోలేదు. తను తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. దయచేసి మీడియా వాళ్ళు ఆదిల్ ఖాన్ ని ఇంటర్వ్యూ చేయకండి. అతన్ని పట్టించుకోకండి. వివాదాలతో అతడు హీరో కావాలి అనుకుంటున్నాడు… అంటూ రాఖీ కీలక ఆరోపణలు చేశారు. అలాగే ఆదిల్ ఖాన్ తో ఎఫైర్ పెట్టుకుందని రాఖీ సావంత్ చెబుతున్న తను అనే అమ్మాయిపై కూడా ఆమె ఫైర్ అయ్యారు, ఆరోపణలు చేశారు.
నా భర్త ఆదిల్ ఖాన్ ని తను బ్లాక్ మెయిల్ చేస్తుంది. తన వద్ద ఆదిల్ బూతు వీడియోలు ఉన్నాయి. అవి బయటపెడతానని భయపెడుతుంది. తను నన్ను కూడా తిట్టింది. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆదిల్ నిన్ను కూడా మోసం చేస్తాడు. నా భర్తను నువ్వు లాగేసుకుని నన్ను బాధ పెట్టాను. నీకు కూడా బాధలు తప్పవు. భవిష్యత్తులో అది నేను కచ్చితంగా చూస్తాను… అని రాఖీ సావంత్ మీడియా ముందు వెల్లడించారు.
ఆదిల్ ఖాన్ తన డబ్బులు తీసుకున్నాడని, మానసికంగా శారీరకంగా హింసించాడని పోలీసులకు కంప్లైంట్ చేశారు. రాఖీ సావంత్ కంప్లైంట్ ఆధారంగా అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత ఏడాది నటుడు ఆదిల్ ఖాన్ ని రాఖీ సావంత్ వివాహం చేసుకున్నారు. ఏడాది లోపే వారి బంధం ముగిసిన సూచనలు కనిపిస్తున్నాయి. రాఖీ సావంత్ కి ఇది రెండో వివాహం. ఇటీవల రాఖీ సావంత్ తల్లిగారు కాన్సర్ తో కన్నుమూశారు.
Also Read:PM Modi- Pathan Movie: కశ్మీర్ రాత మార్చాడు.. ‘పఠాన్’ విజయాన్ని పరోక్షంగా ఒప్పుకున్న మోడీ