Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరు ప్రస్తుతం మామూలు రేంజ్ లో లేదు, సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ , గత కొద్దీ నెలల క్రితమే హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా పూజా కార్యక్రమాలు మొదలెట్టాడు.
Also Read: PM Modi- Pathan Movie: కశ్మీర్ రాత మార్చాడు.. ‘పఠాన్’ విజయాన్ని పరోక్షంగా ఒప్పుకున్న మోడీ
ఆ తర్వాత ఈమధ్యనే ప్రముఖ డైరెక్టర్ సుజిత్ లో ‘OG’ మూవీ ని ప్రారంభించాడు, ఈ రెండు సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయో అనే సందేహం లో ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో ట్విస్టు ఇవ్వబోతున్నాడు..అదేమిటంటే ‘వాలెంటైన్స్ డే’ రోజు పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా ప్రారంభించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.తమిళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘వినోదయ్యా సీతం’ సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడనే విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడు..ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు, గతం లో ఆయన ‘గోపాల గోపాల’ సినిమాలో దేవుడి పాత్ర పోషించిన సంగతి మన అందరికీ తెలిసిందే.మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే తరహా పాత్ర పోషించబోతున్నాడు.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట, ఈ 20 రోజులకు గాను ఆయనకీ 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారట.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు ఫార్చ్యూన్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిమరించబోతున్నారు.ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట,’హరి హర వీరమల్లు’ సినిమాని దసరా కి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు దర్శక నిర్మాతలు.అన్ని అనుకున్నట్టు కుదిరితే పవన్ కళ్యాణ్ నుండి ఈ ఏడాది రెండు సినిమాలు చూడొచ్చు అన్నమాట.
Also Read: This Week Box Office: మూడు చిన్న సినిమాలు… విన్నర్ ఎవరంటే?