మంత్రిగారి ‘కరోనా’ దోపిడీ.. పిండేస్తున్నాడట!

అధికారం చేతిలో ఉంది.. మంత్రి పదవి వరంగా మారింది. ఇంకేం.. ఆ మంత్రిగారు దందా మొదలుపెట్టేశారట.. కరోనా వేళ ఎలా దోచుకోవాలో ఇప్పుడు సాటి మంత్రులకు ఆదర్శంగా నిలబడుతున్నాడట.. కరోనా టైంలో సర్వం ఆ మంత్రిగారి దోపిడీ చూసి ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారట.. కాదేది కరోనా టైంలో దోపిడీకి అనర్హం అంటూ చెలరేగిపోతున్న మంత్రిగారి వ్యవహారం ఇప్పుడు బెజవాడలో కోడై కూస్తున్నారు. Also Read: జగన్ పని అయిపోయినట్లే… బాబు కి ఛాన్స్ ఇచ్చేశాడు మరి! […]

Written By: NARESH, Updated On : August 14, 2020 10:52 am
Follow us on


అధికారం చేతిలో ఉంది.. మంత్రి పదవి వరంగా మారింది. ఇంకేం.. ఆ మంత్రిగారు దందా మొదలుపెట్టేశారట.. కరోనా వేళ ఎలా దోచుకోవాలో ఇప్పుడు సాటి మంత్రులకు ఆదర్శంగా నిలబడుతున్నాడట.. కరోనా టైంలో సర్వం ఆ మంత్రిగారి దోపిడీ చూసి ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారట.. కాదేది కరోనా టైంలో దోపిడీకి అనర్హం అంటూ చెలరేగిపోతున్న మంత్రిగారి వ్యవహారం ఇప్పుడు బెజవాడలో కోడై కూస్తున్నారు.

Also Read: జగన్ పని అయిపోయినట్లే… బాబు కి ఛాన్స్ ఇచ్చేశాడు మరి!

మందు బిళ్ల నుంచి ఆస్పత్రి బెడ్డు వరకు.. కరోనా టెస్టు నుంచి ఆస్పత్రుల బిల్లు వరకు అంతా ఆ మంత్రిగారే వేస్తున్నారట.. కమీషన్లు, వాటాలు, బెడ్ కోసం వసూళ్లు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారని విజయవాడలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

ఇటీవలే సదురు మంత్రిగారి అనుచరుడు ఒకరు ఫార్మా రంగంలో ఉన్నాడట.. దీంతో సదురు అనుచరులంతా నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు, మందుల డిస్ట్రిబ్యూటర్లను సమావేశపరిచి కరోనా కాలంలో బాగా అమ్ముడు పోతున్న మందుల వివరాలు తెలుసుకున్నాడట.. వాటిని తానే సరఫరా చేస్తానని.. వాటిని విక్రయించాలని హుకూం జారీ చేశారు.మాట వినకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. రైడ్స్ జరుగుతాయని హెచ్చరికలు పంపారట..

ఇక మల్టీ విటమిన్లు టాబ్లెట్లు.. జింక్ టాబ్లెట్లు, కరోనా మందులను తామే తయారు చేయించి సరఫరా చేస్తామని.. ఈ పీసీడీ మందులనే వాడాలని అన్ని ఫార్మా, మెడికల్, ఆస్పత్రులకు ఆదేశాలిచ్చాడట.. వీటి ద్వారానే ఏకంగా రూ.50కోట్లు ఆర్జిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. వీటిల్లో నాణ్యత లేక పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Also Read: చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?

కరోనా వేళ ఏపీలో రోజుకు 10వేల కేసులు నమోదవుతున్నాయి. బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకడం లేదు. కానీ మంత్రి అనుచరుడి వద్దకు వెళితే క్షణంలో బెడ్ దొరుకుతోందట.. అలా బెడ్ ఇప్పించినందుకు ఏకంగా రూ.50వేలు వసూలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మంత్రిగారి కోటా కింద కొన్ని బెడ్ లు పక్కన పెట్టాలని ఆస్పత్రులకు హుకూం జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది.

ఇక కరోనా పరీక్షలకు భారీక్యూ ఉంటోంది. కానీ ఇందులోనూ కాసుల కక్కుర్తితో డబ్బులు పిండుకుంటున్నాడని.. ఒక్కో టోకెన్ ను రూ.200 వరకు వసూలు చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మెడికల్ టెండర్లలోనూ మంత్రి బినామీలదే రాజ్యమన్న ప్రచారం సాగుతోంది. మంత్రి బినామీ కంపెనీకే మెడికల్ సర్వీస్ టెండర్ దక్కిందట.దీంతో బెజవాడ చుట్టుపక్కల ఇప్పుడు మొత్తం కరోనా ట్రీట్ మెంట్ మందులు, బెడ్స్ అన్నీ ఆ మంత్రి కనుసన్నల్లోనే జరుగుతోందట.. ఈ టైంలో మంత్రిగారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.