Minister Anil Kumar: ఆంధ్రప్రదేశ్ లో వరద బీభత్సానికి ప్రాజెక్టులు సైతం కొట్టుకుపోయాయి. దీనిపై కేంద్రం, రాష్ర్టం ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారు. తప్పు మీదంటే మీదని మాటల గారడీ చేస్తున్నారు. రాజ్యసభలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి రాష్ర్ట ప్రభుత్వానిదే బాధ్యతని చెప్పడంతో ఏపీ ఖంగుతింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో రాష్ర్ట మంత్రి అనిల్ కుమార్ కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ క్లారిటీ లేకుండా ఏదో ఒకటి మాట్లాడటం ఆయనకు అలవాటే. దీంతో మొదట గత టీడీపీ ప్రభుత్వం అని చెబుతూ మరోమారు బీజేపీపై నెపం పెట్టేందుకు సిద్ధమయ్యారు.

అయితే సీఎం రమేశ్, సుజనా చౌదరిలపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ వారే మంత్రితో ఇలా మాట్లాడించారని నిందలు వేస్తూ మాట్లాడటంతో అందరిలో ఆశ్చర్యం నెలకొంది. సంబంధిత మంత్రి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే ఎలా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దేనిపై క్లారిటీ లేకుండా ఎవరు దొరికితే వారిపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: గ్రీజు పెట్టని జగన్ మూడు రాజధానులు నిర్మిస్తాడా.. పరువు తీసేసిన చంద్రబాబు
దీంతో జీవీఎల్ నరసింహారావు సైతం స్పందించి అనిల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో వివాదం ముదురుతోంది. ఒక రాష్ర్ట మంత్రి కేంద్రంపై ఇలాంటి విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే సందేహాలు వస్తున్నాయి. అయినా ఆయనలో ఎలాంటి మార్పు లేదు. విషయం తెలియక విమర్శలు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. నిదానంగా అవగాహనతో మాట్లాడటం అలవాటు చేసుకుంటే మంచిదనే అభిప్రాయాలు అందరిలో వస్తున్నాయి.
రాష్ర్టంలో కేంద్ర బృందం పర్యటించి నిజానిజాలు తేల్చుతూ నివేదిక రూపొందించింది. దాని ప్రకారమే కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. కేంద్ర బృందం సర్వే రిపోర్టును బయట పెడితే నిజానిజాలు వెల్లడయ్యేవి. రాష్ర్ట ప్రభుత్వ పరువు పోయేది. మంత్రి అనిల్ కుమార్ నోరు అదుపులో పెట్టుకుంటేనే మంచిదనే అభిప్రాయాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: ఏపీలో జగన్ పరిస్థితి ఏంటి? మళ్లీ గెలవగలడా? టీడీపీ పోటీనిస్తుందా?