Minister Ambati Rambabu: ఏపీలో అధికార వైసీపీ నాయకులు విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పీకే బృందం విష ప్రచారానికి తెరలేపింది. ప్రజలను వర్గాలుగా విభజించి మరీ అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా చేసింది. ఇప్పుడు అదే సోషల్ మీడియా అధికార పార్టీకి ప్రతిబంధకంగా మారింది. వైసీపీ నేతల అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఎవరూ పనిగట్టుకొని చేయకపోయినా.. ప్రభుత్వ చర్యలు, వైసీపీ నేతల వ్యవహార శైలి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం మెజార్టీ వర్గాల అభిమానం చూరగొనకపోవడంతో సోషల్ మీడియా ప్రచారంలో బాధిత వర్గాలు పాలుపంచుకుంటున్నాయి. దాని ఫలితమే వైసీపీ గవర్నమెంట్ పై పెల్లుబికుతున్న వ్యతిరేకత. స్థానిక సంస్థలు, ఉప ఎన్నికల్లో వరుసగా ఏకపక్ష విజయాలు వరిస్తున్నా.. ప్రజలు ఒక పద్ధతి ప్రకారం వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సాధారణ ఎన్నికల నాటికి అది విస్తృతరూపం దాల్చి వైసీపీకి ఎదురుదెబ్బ ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విశాఖ ఎపిసోడ్ తరువాత వైసీపీ, జనసేన మధ్య పెద్ద యుద్ధ వాతావరణమే నడుస్తోంది. పరస్పర ఆరోపణలతో పొలిటికల్ గా హీటెక్కిస్తున్నారు. విశాఖలో మంత్రులపై దాడి ఆరోపణల నేపథ్యంలో జనసైనికులపై కేసులు నమోదయ్యాయి. జనవాణి కార్యక్రమం నిలిచిపోయింది. మూడు రోజుల పర్యటనకు వెళ్లిన పవన్ హోటల్ కే పరిమితమయ్యారు. అటు తరువాత నేరుగా మంగళగిరి వచ్చి వైసీపీ నేతలను పవన్ ఉతికి ఆరేశారు. కాపు నేతలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. హెచ్చరికలు జారీచేశారు. అటు తరువాత చంద్రబాబు కలవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ కు ప్రధానమైన కాపు సామాజికవర్గం అండ దొరికింది. దీంతో వైసీపీ పునరాలోచనలో పడింది. కాపులను వదులుకుంటే కష్టమని భావించి కాపు నేతలతో ఒక సమావేశం పెట్టించింది. వైసీపీ సర్కారు కాపులకు ప్రాధాన్యమిచ్చిందని వారితో ప్రకటన చేయించింది.

అయితే తాజాగా దూకుడు స్వభావం కలిగిన మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా జనసేనకు కౌంటర్ ఇవ్వాలని భావించారు. రంగా దారుణ హత్యకు తెలుగుదేశం కారణం కాదా? బీసీల్లో చేర్చుతామని మోసం చేసింది టీడీపీ కాదా? ముద్రగడ కుటుంబాన్ని హింసించింది తెలుగుదేశం కాదా? తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలగరా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలను కొనసాగించారు. అయితే ఆయన టీడీపీ, జనసేన నాయకుల నుంచి రెస్పాన్స్ వస్తుందని ఆశించారు. కానీ సామాన్య నెటిజెన్లు సైతం ఆయన్ను తిరిగి ఉతికి ఆరేయ్యడం ప్రారంభించారు. దేవినేని అవినాష్ ను వైసీపీలో చేర్చుకుంది జగన్ కాదా? రంగాను అవమానించిన గౌతమ్ రెడ్డికి పదవి ఇచ్చింది జగన్ కాదా? వంగవీటి రాధాను అవమానించి బయటకు పంపించింది జగన్ కాదా? తుని రైలు దహనం ఘటన వెనుకుంది వైసీపీ కదా? కాపుల ఈబీసీ రిజర్వేషన్ ను రద్దుచేసింది జగన్ కదా? అంటూ ప్రశ్నల పరంపర కొనసాగించారు. గువ్వు ముయ్ రా ముం… కొడ.. అంటూ కూడా హెచ్చరికలు జారీచేశారు. అయితే ఏకంగా మంత్రులకే సామాన్యులు అటాక్ ఇచ్చేసరికి అధికార పార్టీ నేతలకు నోటిమాట రావడం లేదు.