https://oktelugu.com/

గ్రేటర్లో బలబలాలు.. మేయర్ పీఠం దక్కేది ఎవరికీ?

గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. పోలింగ్ ముగిసింది. మొత్తం 150డివిజన్లకు 149స్థానాలకు సోమవారం ఎన్నిక పూర్తయింది. మిగిలిన ఒక్క స్థానానికి(ఓల్డ్ మలక్ పేట్) నేడు ఎన్నిక జరుగనుంది. డిసెంబర్ 4న గ్రేటర్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 40కి కొంచెం అటు ఇటూగా నమోదైనట్లు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం వరకు ఓటింగ్ శాతంపై ఖచ్చితమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో నగర ఓటర్లు ఎవరీవైపు మొగ్గుచూపారనేది మాత్రం తెలియడంలేదు. ఎన్నికల కమిషన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 1, 2020 11:12 pm
    Follow us on

    GHMC Voting

    గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. పోలింగ్ ముగిసింది. మొత్తం 150డివిజన్లకు 149స్థానాలకు సోమవారం ఎన్నిక పూర్తయింది. మిగిలిన ఒక్క స్థానానికి(ఓల్డ్ మలక్ పేట్) నేడు ఎన్నిక జరుగనుంది. డిసెంబర్ 4న గ్రేటర్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 40కి కొంచెం అటు ఇటూగా నమోదైనట్లు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం వరకు ఓటింగ్ శాతంపై ఖచ్చితమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది.

    ఈ ఎన్నికల్లో నగర ఓటర్లు ఎవరీవైపు మొగ్గుచూపారనేది మాత్రం తెలియడంలేదు. ఎన్నికల కమిషన్ ఎగ్జిట్స్ పోల్స్ ను బుధవారం సాయంత్రం 5గంటల వరకు వెల్లడించొద్దని ఆదేశాలు జారీచేయడంతో ఓటర్లు ఎవరికీ వైపు ఉన్నారనేది చెప్పడం కష్టంగా మారింది. అయితే గ్రేటర్ పరిధిలో పార్టీల బలాబలాలను లెక్కతీసుకుంటే మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందనే అంచనాకు రావొచ్చు.

    గ్రేటర్‌లో పరిధిలోని 150 డివిజన్ల కార్పొరేటర్లను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోనున్నారు. మేయర్ ను మాత్రం కార్పొరేటర్లు.. గ్రేటర్‌ ఓటు హక్కు కలిగిన ఎక్స్‌ అఫీషియో సభ్యులంతా కలిసి పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. నగరంలో ప్రజాప్రతినిధులు.. గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలను కలుపుకుంటే మొత్తం 52మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులున్నారు. 150 కార్పొరేటర్లకుతోడు 52ఎక్స్ అఫీషియో మెంబర్లను కలుపుకుంటే మొత్తం ఓట్ల సంఖ్య 202కు చేరింది. ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్ 102ఓట్లు అన్నమాట.

    గ్రేటర్ పరిధిలో ఆయా పార్టీలకు ఉన్న ఎక్స్ ఆఫీషియో ఓట్లను పరిశీలిస్తే.. టీఆర్ఎస్ కు 37మంది ఎక్స్‌ అఫీషియో సభ్యుల బలం ఉంది. దీంతో ఆపార్టీ కేవలం 65కార్పొరేట్ స్థానాలను గెలుచుకుంటే సరిపోతుంది. బీజేపీకి మూడు ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఉండటంతో ఆ పార్టీ 99స్థానాలను.. కాంగ్రెస్ కు ఒక్క ఆఫీషియో ఓటు ఉండటంతో 101స్థానాలను.. ఎంఐఎంకు 10ఎక్స్‌ అఫీషియో ఓట్లు ఉండంతో ఆపార్టీ 92కార్పొరేట్ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది.