https://oktelugu.com/

ముస్లింలు మమతకు జాగీర్లు కాదంటున్న ఎంఐఎం నేత..!

త్వరలోనే పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి ప్రచార వ్యూహాలు రచిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సైతం రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈసారి పాగా వేసేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దీంతో బీజేపీపై సీఎం మమత కన్నెర్ర చేస్తున్నారు. ఈక్రమంలో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ అన్నట్లుగా పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు సాగుతోన్నాయి. ఈక్రమంలోనే మమత బెనర్జీ ఎంఐఎంపై విమర్శలు గుప్పించారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 16, 2020 / 09:57 PM IST
    Follow us on

    త్వరలోనే పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి ప్రచార వ్యూహాలు రచిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సైతం రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

    పశ్చిమ బెంగాల్లో ఈసారి పాగా వేసేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దీంతో బీజేపీపై సీఎం మమత కన్నెర్ర చేస్తున్నారు. ఈక్రమంలో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ అన్నట్లుగా పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు సాగుతోన్నాయి.

    ఈక్రమంలోనే మమత బెనర్జీ ఎంఐఎంపై విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ ఓటర్లను విడదీయడం కోసం బీజేపీ కోట్ల రూపాయాలు వెచ్చించి హైదరాబాద్ పార్టీని తీసుకొస్తుందన్నారు. బీహార్లో ఎంఐఎం ముస్లింల ఓట్లు చీల్చడంతోనే బీజేపీ గెలిచిందని ఆరోపించారు.

    మమత బెనర్జీ వ్యాఖ్యలపై ఎంఐఎం నేతల అసరుద్దీన్ ఓవైసీ తాజాగా స్పందించారు. తనను డబ్బుతో కొనగలిగే నేత ఇంకా పుట్టలేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం మమత ఆరోపణలన్నీ నిరాధారమైనవి అంటూ అసరుద్దీన్ ఓవైసీ కొట్టిపారేశారు.

    తృణమూల్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతుండటంతో ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. తొలుత ఆమె సొంత ఇంటిని చక్కబెట్టుకోవాలంటూ సలహా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లోనూ తమకు బలమున్న చోట్ల ఎంఐఎం పోటీ చేసి గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.