MIM- Shiv Sena: రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు. శాశ్వత శత్రువులు ఉండరు అనేది నిజమే. మహారాష్ట్రలో శివసేన ఎంఐఎం కూటమి జట్టు కట్టడం వింత గొలుపుతోంది. రెండు మతతత్వ పార్టీలు పొత్తు పెట్టుకోవం సంచలనం కలిగిస్తోంది. సిద్ధాంతపరమైన విభేదాలున్నా రాజ్యసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండు పార్టీలు చేతులు కలపడం చర్చనీయాంశం అయింది. బీజేపీని ఓడించే క్రమంలో ఈ రెండు పార్టీలు ఏకమైనట్లు చెబుతున్నారు. మొత్తానికి పరస్పర విభేదాలున్న పార్టీలు ఏకం కావడం విచిత్రమే. కానీ ఈ పొత్తు ఎంత కాలం ఉంటుందో తెలియడం లేదు. ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికే ఏకమైనట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆరు స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో బీజేపీని ఓడించాలని శివసేన, ఎంఐఎం జట్టు కట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముస్లింల కోసం పోరాడే పార్టీ ఎంఐఎం, హిందూత్వ నినాదంతో నడిచే పార్టీ శివసేన. ఈ రెండు పార్టీలు ఒక్కటి కావడమే విచిత్రం. దీంతో ప్రజల్లో కూడా పెద్ద చర్చ సాగుతోంది. శివసేన, ఎంఐఎం పొత్తు ఏ మేరకు ఉంటుందో తెలియడం లేదు.
Also Read: Somu Veerraju: ఆత్మకూరులో కనిపించని బీజేపీ మీడియా పులులు.. సోము వీర్రాజు ఒంటరి పోరాటం
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎంఐఎం కోరుతోంది. సిద్ధాంతపరమైన విభేదాలున్నప్పటికి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఓటమి పాలు చేసేందుకు రెండు పార్టీలు జత కలిసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ట్విటర్ ద్వారా వారి పొత్తుల విషయాన్ని ధ్రువీకరించారు. పొత్తుతో బీజేపీని చిత్తు చేయడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రానీయకుండా చేస్తామని పేర్కొన్నారు.

వీరి పొత్తు వ్యవహారంపై పెద్ద దుమారమే రేగుతోంది. శివసేనలోని కొందరు ముస్లిం పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారనే వాదనలు కూడా తెస్తున్నారు. దీనిపై అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని చెబుతున్నారు. కానీ కొందరు మాత్రం వారి వాదనను ఏకీభవించడం లేదు. ఇదో అనైతిక పొత్తుగా అభివర్ణిస్తున్నారు. మనం గెలవడానికి ఎంఐఎం పార్టీనే దొరికిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంతో కాలం నిలవదని కుండ బద్దలు కొడుతున్నారు. దీనిపై ఇంకా పెద్ద గొడవలే జరగనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Also Read:KCR- RTC Charges Increased Again: కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయా
[…] […]