https://oktelugu.com/

జగన్ సీటుకు ఎసరు.. ఎంఐఎం అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

ఎంతకాదనుకున్నా.. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి మంచి మిత్రుడు. ఎంతలా అంటే.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి వెళ్లి మరీ సీఎం జగన్‌కు మద్దతుగా ప్రచారం సైతం చేశారు. అయితే.. అలాంటి మిత్రుడు ఈ మధ్య షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఇటీవల ‘ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఎ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం)’ పార్టీ 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. పార్టీ పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా, ఇన్నేళ్ల తర్వాతగానీ ఆంధ్రప్రదేశ్ పై […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 7, 2021 3:31 pm
    Follow us on

    Asaduddin
    ఎంతకాదనుకున్నా.. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి మంచి మిత్రుడు. ఎంతలా అంటే.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి వెళ్లి మరీ సీఎం జగన్‌కు మద్దతుగా ప్రచారం సైతం చేశారు. అయితే.. అలాంటి మిత్రుడు ఈ మధ్య షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఇటీవల ‘ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఎ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం)’ పార్టీ 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. పార్టీ పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా, ఇన్నేళ్ల తర్వాతగానీ ఆంధ్రప్రదేశ్ పై పట్టుకోసం ప్రయత్నాలు ఆరంభించింది.

    Also Read: బాలయ్య.. దబిడి.. దిబిడి

    ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి దిగడం ద్వారా ఎంఐఎం తన బేస్‌ను విస్తరించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ క్రమంలో సహజంగానే బీజేపీతోపాటు అధికార వైసీపీనీ మజ్లిస్ టార్గెట్ చేసింది. సంచలనాలకు కేంద్రంగా ఉండే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.. ఏపీ సీఎం జగన్ పై, వైసీపీ కీలక నేతలపై తీవ్ర కామెంట్లు చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

    Also Read: ముందుకు సాగని ప్రచార ‘పవనాలు’

    గతంలో జరిగిన ఎన్నికల్లో జగన్‌కు మద్దతివ్వాలని, వైసీపీకి ఓట్లేయాలని ఎంఐఎం కార్యకర్తలు, నేతలకు బహిరంగంగా చెప్పామని అధినేత ఓవైసీ గుర్తుచేశారు. అయితే.. ఈసారి మాత్రం వైసీపీకి ఓటేయొద్దని, ఎంఎంఐం అభ్యర్థులకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఏపీకి సంబంధించిన కీలక సమస్యలపై మజ్లిస్ పోరాడుతుందని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, జగన్ ప్రభుత్వ భూముల్ని అమ్మడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామని ఓవైసీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో జగన్, బీజేపీలపై ఆయన మరికొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని.. ఈ విషయం పట్టనట్లుగా సీఎం జగన్ కళ్లు మూసుకుని ఉంటే ఆయన సీటుకే ఎసరు వస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ హెచ్చరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పట్ల జగన్ జాగ్రత్తగా వ్యవహరించాలని, మతోన్మాదులను ఉక్కుపాదంతో అణచేయాలని అన్నారు. ఎంఐఎం పట్ల జగన్ వైఖరి సవ్యంగా లేదన్న ఆయన.. రాబోయే రోజుల్లో అన్ని స్థానాల్లోనూ పోటీకి దిగుతామన్నారు. వైసీపీని రెడ్ల పార్టీగా, టీడీపీని కమ్మ పార్టీగా ఓవైసీ అభివర్ణించారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    2014లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 34 అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం బరిలోకి దిగింది. అదే ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆధోనిలో 4 వార్డులు గెలుచుకోగా, ఇప్పుడు ఏకంగా నాలుగు జిల్లాల్లో పోటీకి దిగుతోంది. కర్నూలు, అనంతపురం, కడప, కృష్ణాజిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వ్యూహాత్మకంగా 47 వార్డుల్లో మాత్రమే ఎంఐఎం అభ్యర్థుల్ని నిలబెట్టింది. కాగా.. ఆయా స్థానాల్లో హిందువులను సైతం మజ్లిస్ అభ్యర్థులుగా నిలిపింది. ఎంపీఎం పోటీచేస్తున్న స్థానాల్లో ఆధోని, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, నందికొట్కూరు, గుంతకల్, కదిరి, రాయదుర్గం, హిందూపూర్‌‌తోపాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉన్నాయి. పలు పట్టణాల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్న ఓవైసీ.. బీజేపీ, వైసీపీని కలిపి టార్గెట్ చేస్తున్నారు.