ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కు భారీ షాకిచ్చారు

ట్విటర్ మరో అప్రతిస్టను మూటగట్టుకుంది. తన డొల్ల తనాన్ని బయటపెట్టుకుంది. సెక్యూరిటీ లేని వైనాన్ని తేటతెల్లం చేసుకుంది. తాజాగా అఖిల భారత మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి హ్యాకర్లు షాకిచ్చారు. దేశంలో కొద్దిరోజులుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన టాప్ మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విటర్ వేదికగా చెలరేగిపోయారు. దీనికి ఎంఐఎం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను వినయోగించుకున్నారు. ఇప్పటికే దుందుడుకు చర్యలతో నిషేధాన్ని ఎదుర్కొంటున్న […]

Written By: Srinivas, Updated On : July 18, 2021 6:37 pm
Follow us on

ట్విటర్ మరో అప్రతిస్టను మూటగట్టుకుంది. తన డొల్ల తనాన్ని బయటపెట్టుకుంది. సెక్యూరిటీ లేని వైనాన్ని తేటతెల్లం చేసుకుంది. తాజాగా అఖిల భారత మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి హ్యాకర్లు షాకిచ్చారు. దేశంలో కొద్దిరోజులుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన టాప్ మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విటర్ వేదికగా చెలరేగిపోయారు. దీనికి ఎంఐఎం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను వినయోగించుకున్నారు. ఇప్పటికే దుందుడుకు చర్యలతో నిషేధాన్ని ఎదుర్కొంటున్న ట్విటర్ మరోసారి అదే రీతిలో వార్తల్లోకి ఎక్కింది.

అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వాన్ని వహిస్తోన్న ఏఐఎంఐఎం అధికారిక ట్విటర్ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. అందులో డిస్ ప్లే ఇమేజ్ గా ఉనన మజ్లిస్ ఎన్నికల గుర్తు గాలిపటాన్ని తొలగించారు. డిస్ ప్లే పేరును మార్చారు. వాటి స్థానంలో ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, టెస్లా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ చీఫ్ ఇంజనీర్ ఎలాన్ మస్క్ ఫొటో, పేరును పొందుపరచారు. తమ అధికారిక ట్విటర్ ఖాతా హ్యాక్ అయినట్లు ఎంఐఎం ధ్రువీకరించింది.

ఇదివరకు డిస్ ప్లే ఇమేజ్ గా పార్టీ ఎన్నికల గుర్తు గాలిపటం ఉండగా, ఇప్పుడు హ్యాకర్లు దాని స్థానంలో ఎలాన్ మస్క్ ఫొటో పెట్టారు. పేరును కూడా మార్చారు. ఎంఐఎం అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ రెండు మార్పులు తప్ప మరేమీ చోటుచేసుకోలేదు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పాతబస్తీలో అసదుద్దీన్ ఓవైసీ పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు యథాతథంగా ఉన్నాయి.

భారీ వర్షాల వల్ల జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో ఇదివరకు అసదుద్దీన్ ఓవైసీ, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేసిన పర్యటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోల జోలికి పోలేదు. హ్యాకర్లు, డిస్ ప్లే ఇమేజ్, పేరును మాత్రమే మార్చేశారు. దీనిపై ఎంఐఎం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఐటీ యాక్ట్ ఉల్లంఘన కింద ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్విటర్ యాజమాన్యం తాజాగా హ్యాకింగ్ ఘటనలో సెక్యూరిటీ సిస్టమ్ లోను లోపాలు ఉందనే విషయం బయటపడింది.