Military Vehicles : భారతీయ సైన్యం ప్రపంచంలోని అత్యంత పవర్ ఫుల్ సైన్యాలలో ఒకటి. సైన్యం వద్ద అనేక అత్యాధునిక ఆయుధాలతో పాటు దాని శక్తిని పెంచే అనేక ప్రత్యేక వాహనాలు కూడా ఉన్నాయి. ఈ కథనంలో సైన్యం ఉపయోగించే కొన్ని ప్రత్యేకమైన వాహనాల గురించి తెలుసుకుందాం. భారత సైన్యం ఎస్‌యూవీ ఫ్లీట్‌లో ఉన్న ఈ వాహనాలు టెక్నికల్‌గా అడ్వాన్స్‌డ్‌గా ఉండటమే కాకుండా దేశ భద్రతలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
1. మహీంద్రా అర్మాడో
ఈ భారీ ఎస్‌యూవీని మహీంద్రా ప్రత్యేకంగా సైన్యం కోసం డిజైన్ చేసింది. ఇది CEN B7 STANAG లెవెల్ 2 బుల్లెట్‌ప్రూఫ్ సేఫ్టీ, 215 హార్స్‌పవర్ కలిగిన 3.2 లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ALSV (మహీంద్రా ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్)లో గ్రెనేడ్ లాంచర్, యాంటీ-ట్యాంక్ మిస్సైల్ వంటి ఆయుధాలను కూడా అమర్చవచ్చు.

2. మహీంద్రా స్కార్పియో క్లాసిక్
భారత సైన్యం 2023లో 1,850 కంటే ఎక్కువ స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీలను ఆర్డర్ చేసింది. ఈ వాహనాలు 4×4 డ్రైవ్, ఆలివ్ గ్రీన్ పెయింట్, బ్లాక్‌అవుట్ లైట్స్, టోయింగ్ హుక్ వంటి ఫీచర్లతో వస్తాయి. ఇవి కఠినమైన భూభాగాల్లో పనిచేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ ఎస్‌యూవీని సైన్యం అవసరాలకు అనుగుణంగా కంపెనీ మార్పులు చేసింది.

3. టాటా సఫారి స్టోర్మ్ GS800
సైన్యం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ ఎస్‌యూవీ 800 కిలోగ్రాముల పేలోడ్ కెపాసిటీని కలిగి ఉంది. 4×4 డ్రైవ్, ఎయిర్ కండిషనింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఎస్‌యూవీ ఎత్తైన,మంచు ప్రాంతాలలో నడపడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

4. టయోటా హిలక్స్
2023లో సైన్యం ఫ్లీట్‌లో చేర్చబడిన ఈ పికప్ ట్రక్కును 13,000 అడుగుల ఎత్తు, -15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలో పరీక్షించిన తర్వాత సెలక్ట్ చేశారు. ఈ వాహనం కష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో కూడా మంచి పనితీరును కనబరుస్తుంది.

5. ఫోర్స్ గూర్ఖా
“దేశీ జీ-వ్యాగన్”గా ప్రసిద్ధి చెందిన ఈ ఎస్‌యూవీని 2018లో సైన్యం కోసం లైట్ స్ట్రైక్ వెహికల్‌గా ఎంపిక చేశారు. ఇది 4×4 డ్రైవ్, స్నోర్కెల్, డిఫరెన్షియల్ లాక్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇవి కఠినమైన భూభాగాల్లో నడపడానికి చాలా బాగా పని చేస్తాయి.
