https://oktelugu.com/

కేటీఆర్ ఇలాఖాలో ఆధిపత్య పోరు.. రాజీనామా బాటపట్టిన నేతలు..!

మున్సిపల్.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సొంత జిల్లాలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ మధు రాజేందర్ రాజీనామాతో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మంత్రి కేటీఆర్ సొంత ఇలాఖాలోనే నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. Also Read: కొనసాగుతున్న వ్యవసాయేతర ఆస్తుల స్లాట్ బుకింగ్స్: నేడు, రేపు కూడా.. వేములవాడ మున్సిపాలిటీ పాలవర్గం ఏర్పడి ఏడాది గడవక టీఆర్ఎస్ లో ముసలం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 12, 2020 / 11:37 AM IST
    Follow us on


    మున్సిపల్.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సొంత జిల్లాలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ మధు రాజేందర్ రాజీనామాతో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మంత్రి కేటీఆర్ సొంత ఇలాఖాలోనే నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: కొనసాగుతున్న వ్యవసాయేతర ఆస్తుల స్లాట్ బుకింగ్స్: నేడు, రేపు కూడా..

    వేములవాడ మున్సిపాలిటీ పాలవర్గం ఏర్పడి ఏడాది గడవక టీఆర్ఎస్ లో ముసలం మొదలైంది. ఛైర్మన్.. వైస్ ఛైర్మన్ మధ్య ఆధిపత్య పోరు తీవ్రం కావడంతో వైస్ ఛైర్మన్ మధు రాజేందర్ రాజీనామా చేశారు. టీఆర్ఎస్.. బీజేపీ కౌన్సిలర్లు తనను ఇబ్బందులకు గురిచేస్తుండటంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం అందజేశారు.

    రెండు నెలలుగా చైర్ పర్సన్.. వైస్ చైర్మన్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. గత మున్సిపల్ సమావేశంలో చైర్మన్.. వైస్ ఛైర్మన్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నేతల మధ్య మరోసారి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది.

    ఈ సమయంలో టీఆర్ఎస్.. బీజేపీ  కౌన్సిలర్లు బాహాబాహీకి దిగడం.. వైస్ చైర్మన్‌పై దాడికి దిగడంతో మధు రాజేందర్ మనస్థాపం చెందారు. నాటి నుంచి మధు రాజేందర్ మున్సిపల్ కార్యక్రమాలకు.. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు.

    Also Read: ఆ మంత్రులపై వేటుకే.. కేసీఆర్ మొగ్గుచూపుతున్నారా?

    లాక్డౌన్ సమయంలో మధు రాజేందర్ అన్నదానం వంటి సేవ కార్యక్రమాలు చేయడంతో ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఛైర్మన్ కు సమాచారం లేకుండా నేరుగా నిర్వహించడం.. మున్సిపల్ నుంచి అందిస్తున్న ఐదు రూపాయాల భోజనాన్ని ఆయన తొలినాళ్లలో ఉచితంగా పంపిణీ చేస్తూ సొంత ఇమేజ్ పెంచుకుంటుండటంతో చైర్మన్.. వైస్ ఛైర్మన్ల మధ్య విభేదాలు తలెత్తాయనే టాక్ విన్పిస్తోంది.

    ఈ విబేధాలే రానురాను వారి మధ్య ఆధిపత్య పోరుకు కారణమైందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే రమేష్ బాబు సైతం కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం టీఆర్ఎస్ లో ముసలానికి దారితీసినట్లు కన్పిస్తోంది. కాగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ కు మద్దతుగా మరికొందరు కౌన్సిలర్లు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. ఈ పరిణామాలన్నింటిని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ఎలా రియాక్టవుతారో వేచిచూడాల్సిందే..!

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్