వలస కూలీల ఉప్పెన..!

వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తోన్న కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నగరం గాజువాకలో వేల సంఖ్యలో వలసకులీలు రోడ్డెక్కారు. హెచ్.పి.సి.ఎల్, ఎల్&టి తదితర సంస్థలలో వీరు పని చేస్తున్నారు. కార్మికులు రోడ్డుపైకి రావడంతో గంగవరం పోర్టు రోడ్డులో ట్రాఫిక్ స్థంభించింది. వీరు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాలకు చిందిన వారు. గాజువాక ప్రాతంలో వివిధ సంస్థల్లో 10 వేల మంది వరకూ వలస కార్మికులు కాంట్రాక్టు […]

Written By: Neelambaram, Updated On : May 6, 2020 4:38 pm
Follow us on


వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తోన్న కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నగరం గాజువాకలో వేల సంఖ్యలో వలసకులీలు రోడ్డెక్కారు. హెచ్.పి.సి.ఎల్, ఎల్&టి తదితర సంస్థలలో వీరు పని చేస్తున్నారు. కార్మికులు రోడ్డుపైకి రావడంతో గంగవరం పోర్టు రోడ్డులో ట్రాఫిక్ స్థంభించింది. వీరు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాలకు చిందిన వారు. గాజువాక ప్రాతంలో వివిధ సంస్థల్లో 10 వేల మంది వరకూ వలస కార్మికులు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారు. యాజమాన్యాలు వీరికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తినటానికి తిండి లేక అవస్థ పడుతున్న కార్మికులు అవస్థలు పడుతున్నారు. బకాయి ఉన్న జీవితం చెల్లించి సొంత గ్రామాలకు పంపాలని వారు కోరుతున్నారు. ఏసీపీ రామమోహన్ రావు కార్మికులతో చర్చలు జరుపుతున్నారు.

వలస కూలీల రైళ్లను రద్దు చేసిన బీజేపీ సర్కార్!

అదేవిధంగా తమను సొంతూళ్లకు పంపించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వలస కూలీలు ఆందోళనకు దిగారు. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం బీహార్, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది కూలీలు వచ్చారు. కరోనా నేపథ్యంలో వీరందరినీ రాజమహేంద్రవరం నన్నయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.

అల్లుడి అరాచకాలపై కొరడా ఝుళిపించండి..!

ఈ ఉదయం వీరంతా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు లాలా చెరువు కూడలి వద్ద అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు పట్టించుకోకుండా ముందుకుసాగారు. ప్రత్యేక రైళ్లలో తమను సొంతూళ్లకు పంపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు రైళ్లు సాధ్యం కాదని, కొంత సమయం ఇవ్వాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో కూలీలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో అతిపెద్ద పారిశ్రామిక నగరంగా ఉన్న విశాఖపట్నంలో వేల సంఖ్యలో పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. వీరు ఆందోళనలకు దిగాకముందే వారి గురించి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడం ఉత్తమం.