https://oktelugu.com/

మద్యం అమ్మకాలపై ముఖం చాటేస్తున్న ప్రధాని మోదీ!

మూడో విడత లాక్ డౌన్ విధింపు సందర్భంగా పలు సడలింపులు ఇవ్వడం, ముఖ్యంగా మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సుముఖంగా లేరా? అవుననే భావించవలసి వస్తున్నది. కేవలం పారిశ్రామిక వర్గాల నుండి వచ్చిన వత్తిడి కారణంగా, ఆదాయ వనరులు కోల్పోతున్నామని రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్ధనలు మేరకు అయిష్టంగా ఒప్పుకున్నట్లు వెల్లడవుతుంది. వలస కూలీల రైళ్లను రద్దు చేసిన బీజేపీ సర్కార్! మొదటిలో జనతా కర్ఫ్యూ ప్రకటనను, ఆ తర్వాత వరుసగా రెండు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 6, 2020 / 04:27 PM IST
    Follow us on


    మూడో విడత లాక్ డౌన్ విధింపు సందర్భంగా పలు సడలింపులు ఇవ్వడం, ముఖ్యంగా మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సుముఖంగా లేరా? అవుననే భావించవలసి వస్తున్నది.

    కేవలం పారిశ్రామిక వర్గాల నుండి వచ్చిన వత్తిడి కారణంగా, ఆదాయ వనరులు కోల్పోతున్నామని రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్ధనలు మేరకు అయిష్టంగా ఒప్పుకున్నట్లు వెల్లడవుతుంది.

    వలస కూలీల రైళ్లను రద్దు చేసిన బీజేపీ సర్కార్!

    మొదటిలో జనతా కర్ఫ్యూ ప్రకటనను, ఆ తర్వాత వరుసగా రెండు సార్లు లాక్ డౌన్ ప్రకటనలను ప్రధాని స్వయంగా దేశ ప్రజల ముందుకు వచ్చి ప్రకటించడం తెలిసిందే. అయితే మూడో సారి లాక్ డౌన్ విషయంలో మాత్రం ఆయన ముఖం చాటేశారు.

    దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారనే వార్తలు వచ్చిన తర్వాత ఆయన ట్వీట్ కు పరిమితం కావడం, ఈ సారి హోమ్ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించడం జరిగింది.

    ఉద్యోగాలు పోతాయని 86 శాతం భారతీయుల భయం!

    ప్రస్తుతం ఇచ్చిన సడలింపులు కారణంగా, ముఖ్యంగా మద్యం అమ్మకలకు అనుమతి ఇవ్వడం ద్వారా సుమారు ఆరు వారాలుగా కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్ని వమ్మయిన్నట్లు పలు వర్గాల భావిస్తున్నాయి.

    ప్రపంచంలో అనేక దేశాలకన్నా ముందే లాక్ డౌన్ ప్రకటించి ప్రజలచేత శభాష్ అనిపించుకున్న ప్రధాని మోదీ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    కరోనా కట్టడి విషయంలో ప్రజల దృష్టిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హీరోగా మిగిలారు. పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలులో, కరోనా టెస్ట్ ల నిర్వహణలో, వైద్య సదుపాయాలు ఏర్పర్చడంలో పలు విమర్శలు చెలరేగుతున్నా అవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల అసమర్ధతగానే ప్రజలు భావిస్తున్నారు.

    మద్యం షాపుల సాకుతో జనం రోడ్లపైకి యద్దేచ్ఛగా వస్తుండడం, సాంఘిక దూరం పాటించడం సాధ్యం కాకపోవడంతో కరోనా వైరస్ తిరిగి విజృభించడానికి మళ్ళి ఎక్కడకు దారితీస్తుందో అనే భయం ప్రజలలో వ్యక్తం అవుతున్నది.

    మత సామరస్యం సాధ్యమేనా ? (Part 4)

    పైగా ఇదే అదను అనుకోని ఆదాయం కోసం అర్రులు చాస్తున్న రాష్త్ర ప్రభుత్వాలు విపరీతంగా మద్యం ధరలు పెంచడంతో ప్రజలు మరింతగా ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీ ప్రభుతాలు అయితే ఏకంగా 75 శాతం ధర పెంచేసాయి. ఒక సాధారణ మద్యం సీసా కొనుగోలు చేయాలి అంటే ఇప్పుడు రూ 350 అవుతుందని చెబుతున్నారు.

    కూలి డబ్బు అంతా మద్యంకు ఖర్చయితే మిగిలిన డబ్బు కోసం ఇంట్లో ఆడవారిని వేధించక తప్పదనే ఆవేదన వ్యక్తం అవుతున్నది. ఇప్పటి వరకు లాక్ డౌన్ పేరుతో ఇళ్లల్లో ప్రశాంతంగా ఉన్నవారిలో ఆటవిక ప్రవర్తనను ప్రభుత్వాలే రెచ్చగొడుతున్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. గృహ హింస హద్దులు మీరెందుకు ప్రభుత్వాలే దోహదం చేస్తున్నాయనే విమర్శలు చెలరేగుతున్నాయి.

    లాక్ డౌన్ తో ఆదాయం లేక ఇబ్బందు పడుతున్నారని ప్రభుత్వం జన్ ధన్ ఖాతాలలో నగదు వేసి, ఉచిత రేషన్ సమకూర్చి, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు భారీగా ఆహార వస్తువులను విరాళంగా సమకూరుస్తున్నారు.
    ఈ ప్రయోజనాలు పొందుతున్న వారే ఇప్పుడు మద్యం కోసం క్యూలలో నిలబడుతూ ఉండడంతో మిగిలిన ప్రజల్లో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి.

    మద్యం షాపులు తెరుచుకున్న తర్వాత ఇదివరకటి వలే రోడ్డులపై పెద్దగా పోలీసులు కనిపించడం లేదు. అదేమంటే వారంతా మద్యం షాపుల చుట్టే తిరుగుతున్నారని చెబుతున్నారు.