Saripodhaa Sanivaaram Collections: 42 కోట్ల రూపాయిల టార్గెట్..కానీ 2 రోజుల్లో ‘సరిపోదా శనివారం’ రాబట్టిన వసూళ్లు ఎంతంటే!

రెండవ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టి నాని స్టామినా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించేలా చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఓవర్సీస్, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి భారీ వసూళ్లు రెండవ రోజు కూడా వచ్చాయి.

Written By: Vicky, Updated On : August 31, 2024 2:16 pm

Saripodhaa Sanivaaram 2 days Box Office Collections

Follow us on

Saripodhaa Sanivaaram Collections: నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా అదిరిపోయాయి. నాని కెరీర్ లో నెంబర్ 1 ఓపెనింగ్స్ అని చెప్పలేము కానీ, టాప్ 3 లో ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిల్చింది. ఇక రెండవ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టి నాని స్టామినా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించేలా చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఓవర్సీస్, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి భారీ వసూళ్లు రెండవ రోజు కూడా వచ్చాయి.

ఒక్కసారి ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే కేవలం ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ సినిమాకి రెండు రోజుల వసూళ్లు 4 కోట్ల 16 లక్షల రూపాయిలు రాగా, కేవలం రెండవ రోజే కోటి 41 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అలాగే సీడెడ్ లో రెండు రోజులకు కలిపి కోటి 22 లక్షల రూపాయిలు, ఉత్తరాంధ్ర లో కోటి 15 లక్షల రూపాయిలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 47 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 45 లక్షల రూపాయిలు, గుంటూరులో 52 లక్షల రూపాయిలు, కృష్ణా జిల్లాలో 60 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి రెండు రోజులకు గానూ 8 కోట్ల 92 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు రాగా, కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రెండు కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి స్టార్ హీరో రేంజ్ వసూళ్లు వచ్చాయనే చెప్పాలి. అక్కడి ట్రేడ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి కేవలం రెండు రోజులకు కలిపి 5 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 16 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వీకెండ్ కి 30 కోట్ల రూపాయిల షేర్ మార్కుకి బాగా దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక జరిగితే ఈ చిత్రం లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి భవిష్యత్తులో ఈ చిత్రం రేంజ్ ఎక్కడ దాకా వెళ్లబోతుంది అనేది.