https://oktelugu.com/

మూడు సెకండ్ల వీడియో.. అమెరికాలో హల్చల్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నవంబర్ లో జరుగనున్నాయి. ఈనేపథ్యంలో అమెరికాలో ఎన్నికల సందడి ఇప్పటికే మొదలైంది. డెమోక్రాట్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ అభ్యర్థిగా జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ గా ఇండో-ఆఫ్రికన్ మహిళ కమలా హ్యారిష్ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా రిపబ్లిక్ పార్టీ తరుఫున అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి నామినేషన్ వేశారు. ట్రంప్ నామినేషన్ నుంచి రాజకీయ వేడి మొదలైనట్లు కన్పిస్తోంది. Also Read: అసమ్మతి నేతలపై సోనియా వేటు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 28, 2020 / 05:51 PM IST
    Follow us on


    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నవంబర్ లో జరుగనున్నాయి. ఈనేపథ్యంలో అమెరికాలో ఎన్నికల సందడి ఇప్పటికే మొదలైంది. డెమోక్రాట్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ అభ్యర్థిగా జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ గా ఇండో-ఆఫ్రికన్ మహిళ కమలా హ్యారిష్ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా రిపబ్లిక్ పార్టీ తరుఫున అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి నామినేషన్ వేశారు. ట్రంప్ నామినేషన్ నుంచి రాజకీయ వేడి మొదలైనట్లు కన్పిస్తోంది.

    Also Read: అసమ్మతి నేతలపై సోనియా వేటు వేస్తారా?

    అమెరికా వైట్‌ హౌస్‌లోని సౌత్‌ లాన్‌లో ట్రంప్ నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. అయితే ట్రంప్ నామినేషన్ కంటే కూడా ట్రంప్ ప్రస్తుత భార్య మెలానీయా, ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంక ట్రంప్ మధ్య చోటుచేసుకున్న ఒక సంఘటన హాట్ టాపిక్ గా మారింది. కేవలం మూడు సెకన్ల నిడివిగల వీడియోలో ట్రంప్ భార్య, కూతురు మద్య జరిగిన పలకరింపు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రంప్ భార్యకు, కూతురు మధ్య సత్సంబంధాలు లేవంటూ ఈ వీడియోను అమెరికాలో నెటిజన్లు షేర్ చేస్తుండగా ప్రస్తుతం ట్రెండింగులో దూసుకెళుతోంది.

    ట్రంప్ తన తొలి భార్యకు విడాకులు ఇచ్చి మెలానీయాను పెళ్లి చేసుకున్నాడు. ట్రంప్ తొలి భార్యకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు వేరేచోట ఉంటుండగా కూతురు ఇవాంక మాత్రం తండ్రితోనే అధ్యక్ష భవనంలో ఉంటుంది. ఇటీవల ట్రంప్ భారత్ వచ్చినపుడు కూడా ఇవాంక ఆయన వెంట వచ్చింది. అయితే ఇవాంకకు ఆమె సవితి తల్లి మెలానీయాకు సత్సంబంధాలు లేవని అమెరికా మీడియాలో వార్తలు తరుచూ విన్పిస్తూనే ఉన్నాయి.

    తాజాగా ట్రంప్ నామినేషన్ సందర్భంగా మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. ట్రంప్ నామినేషన్ కార్యక్రమంలో ఆయన కుమార్తె ఇవాంకను ట్రంప్‌ను పరిచయం చేశాడు. ఈ సందర్భంగా ఇవాంక తన తండ్రి ట్రంప్ తోపాటు మెలానీయాను విష్ చేస్తూ చిరునవ్వు చిందిస్తుంది. దీనికి బదులుగా మెలానీయా కూడా చిరునవ్వులు చిందించింది. ఇవాంక అటు వెళ్లగానే సెకన్ల వ్యవధిలోనే మెలానీయా ముఖం చిట్లించుకున్నట్లు వీడియోలో కన్పిస్తోంది. దీనిని ట్రంప్ వ్యతిరేక బ్యాచ్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవీ గెలుస్తాడో లేదోగానీ ఎన్నికలు పూర్తయ్యే నాటికి ఆయన ఇంట్లో అమెరికా మీడియా చిచ్చు పెట్టడం ఖాయంగా కన్పిస్తోంది.