తెలంగాణను సాధించిన పార్టీగా టీఆర్ఎస్ కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణకు తొలి సీఎం అయ్యాక అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్నలను చూరగొన్నారు. దీంతో రెండోసారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే విజయం సాధించారనే టాక్ ఉన్నా.. అది కేసీఆర్ చాణిక్యానికి నిదర్శంగా నిలుస్తోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ తెలంగాణలో మరింత బలోపేతం అయింది.
Also Read: జై కేటీఆర్.. ఆయనే మా సీఎం
గడిచిన ఆరేళ్లుగా తెలంగాణ ఎలాంటి ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్లుగా టీఆర్ఎస్ దూసుకెళుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్, కార్పోరేషన్, మున్సిపల్, సర్పంచ్, సహకార ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ జెట్ స్పీడుతో దూసుకెళుతుండగా ప్రతిపక్షాలు మాత్రం బేజారవుతున్నాయి. ప్రతీ ఎన్నికలోనూ టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెంవేయలేక చతికిలిపడిపోతున్నాయి. అయితే త్వరలోనే రానున్న గ్రేటర్ ఎన్నికలు టీఆర్ఎస్ సత్తాకు గిటురాయిగా మారనున్నాయనే టాక్ విన్పిస్తోంది.
వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మూడు ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ఆయా పట్టణాల్లో అభివృద్ధి పనుల జోరును పెంచారు. ప్రభుత్వం కూడా అధిక నిధులు మంజూరు చేస్తుండటంతో నేతలు పర్యటనలు, శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనాను ప్రభుత్వం కట్టడి చేయలేకపోయిందని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరమంతా వరదల్లో కురుకుపోవడంతో హైదరాబాద్లో టీఆర్ఎస్ అభివృద్ధి చేసిందీ ఏమిలేదనే భావనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వరంగల్ నగరం ఇటీవల కురిసిన చిన్నపాటి వానకే వరదముంపునకు గురైంది. గత ఆరేళ్లలో అభివృద్ధి కూడా అంతంత మాత్రంగా జరిగిందనే టాక్ విన్పిస్తోంది. ఇక ఖమ్మం టీఆర్ఎస్ లో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
Also Read: బాబు అరాచకానికి నేటితో 20ఏళ్లు..!
దీంతో ఈ మూడు ప్రాంతాల్లో టీఆర్ఎస్ గెలుపు అంతా ఈజీ కాదనే టాక్ విన్పిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో విఫలమైతే టీఆర్ఎస్ మరోసారి జెడ్ స్పీడుతో దూసుకెళ్లడం ఖాయంగా కన్పిస్తోంది. కరోనా ఎఫెక్ట్.. వరదలతో టీఆర్ఎస్ పై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ప్రతిపక్షాలు ఏమేరకు క్యాష్ చేసుకుంటాయనే దానిపైనే ఆ పార్టీల విజయావకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారైనా ప్రతిపక్షాలు కారు స్పీడుకు బ్రేకులు వేస్తాయో లేదో వేచి చూడాల్సిందే..!