https://oktelugu.com/

అనుష్క ‘నిశ్శబ్దం’ పై.. మౌనమేలా?

కరోనా పరిస్థితుల రీత్యా అంచనాలు ఉన్న సినిమాలు కూడా నేరుగా ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. మొదటి నుండీ ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ కు మన టాలీవుడ్ దూరంగానే ఉన్నా.. కరోనా ప్రవాహంలో డిజిటల్ రిలీజ్ కి మన టాలీవుడ్ మేకర్స్ అంగీకరించక తప్పలేదు. ఇప్పటికే చిన్నాచితకా బడ్జెట్ సినిమాలు కొన్ని రిలీజ్ అవ్వగా, ఇప్పుడు నాని ‘వి’తో మీడియం బడ్జెట్ సినిమాల విడుదల పరంపర కూడా మొదలు అయింది. అయితే రిలీజ్ కి రెడీగా ఉన్న మోస్ట్ […]

Written By: , Updated On : August 28, 2020 / 06:10 PM IST
Follow us on


కరోనా పరిస్థితుల రీత్యా అంచనాలు ఉన్న సినిమాలు కూడా నేరుగా ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. మొదటి నుండీ ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ కు మన టాలీవుడ్ దూరంగానే ఉన్నా.. కరోనా ప్రవాహంలో డిజిటల్ రిలీజ్ కి మన టాలీవుడ్ మేకర్స్ అంగీకరించక తప్పలేదు. ఇప్పటికే చిన్నాచితకా బడ్జెట్ సినిమాలు కొన్ని రిలీజ్ అవ్వగా, ఇప్పుడు నాని ‘వి’తో మీడియం బడ్జెట్ సినిమాల విడుదల పరంపర కూడా మొదలు అయింది. అయితే రిలీజ్ కి రెడీగా ఉన్న మోస్ట్ వాంటెడ్ సినిమాల్లో అనుష్క “నిశ్శబ్దం” కూడా ఒకటి. ఈ సినిమా ఓటీటీలో వస్తోందని రచయిత కోన వెంకట్ ఆ మధ్య హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత మళ్ళీ ఈ సినిమా రిలీజ్ గురించి మళ్ళీ ఏ వార్త వినిపించలేదు. ఈ సినిమా కోసం నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నా.. మేకర్స్ మాత్రం మౌనం వీడటం లేదు.

Also Read:  బన్నీ- కొరటాల.. భరత్‌ అనే నేను ఫార్ములా

ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించడం, పైగా సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కావడం, ముఖ్యంగా సినిమాలో ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ సీన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయనే ఆసక్తి కలగడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ థ్రిల్లర్ లో మర్డర్ చేసింది ఎవరనే కోణంలో సినిమా సాగుతుందట. అలాగే మంచి ఎమోషనల్ కంటెంట్ తో కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఈ సినిమా ఉంటుందని.. అన్నిటికి మించి అనుష్క పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని.. ఆ నెగెటివ్ యాంగిల్ నుండి పాజిటివ్ యాంగిల్ లోకి ఆమె క్యారెక్టర్ ఎలా మారింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుంటుందని… ఇలా అనుష్క క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.

Also Read: మళ్లీ సౌత్‌పై కన్నేసిన తాప్సీ

అయితే అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు… ఈ సినిమా పరిస్థితి తగలడింది. అసలు ‘నిశ్శబ్దం’ సినిమా నిజానికి గత ఏడాదే రిలీజ్ అవుతుందనుకున్నారు.. మేకర్స్ కూడా ఆ మధ్య రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేశారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల.. జనవరి లాస్ట్ వీక్ కి రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అయిందని అనుష్క టీమ్ వివరణ ఇచ్చింది. చివరకు ఆ డేట్ కూడా మిస్ అయింది. ఆ తరువాత ఇక కరోనా వచ్చింది. అయితే ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాత కోన వెంకట్ ప్లాన్ చేసుకున్నా.. ఆయనకు ఓ ఛానల్ కు మధ్య సాగిన ఆర్ధిక లావాదేవీల గందరగోళంలో లెక్కలు తేడా వచ్చి.. ‘నిశ్శబ్దం’ రిలీజ్ కు అడ్డుపడ్డాయి. కానీ కోన ఆ అడ్డును నిశ్శబ్దంగానే వదిలించుకుని.. సినిమా ను విడుదలకు రెడీ చేస్తున్నాడు అనుకుంటే.. ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. మరి ఈ మౌనం ఎప్పుడు విడుతారో చూడాలి.