Mekapati Goutham Reddy: ఏపీ సీఎం జగన్ కు నమ్మిన బంటు.. రైట్ హ్యాండ్ గా ఉండే ఏపీ దివంగత మంత్రి గౌతం రెడ్డి మరణం అందరినీ కృంగదీసింది. రాజకీయవర్గాల్లో విషాదం నింపింది. తోటి సహచరుడిని కోల్పోవడంతో జగన్ సహా మంత్రులంతా విషాదంలో మునిగిపోయారు. చెట్టంత కొడుకు పోయి గౌతం రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రమంలోనే కొడుకు లేనప్పుడు ఇన్ని ఆస్తులు ఎందుకంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా వందల కోట్లను ఏపీ ప్రభుత్వానికి ధారదత్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదిప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనమైంది.
ఏపీ దివంగత ముఖ్యమంత్రి గౌతంరెడ్డి పేరిట వర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు తాజాగా సీఎం జగన్ ను కోరారు. అందుకు అవసరమైన 225 కోట్ల విలువైన ఆస్తులను అప్పగిస్తామని చెప్పారు. కోటి, రెండు కోట్ల విరాళాలకే ముందుకు రాని ఈరోజుల్లో ఏకంగా 225 కోట్లను ప్రభుత్వానికి ఇస్తున్న గౌతం రెడ్డి కుటుంబంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వంద ఎకరాల్లో స్థాపించిన రూ.225 కోట్ల విలువైన మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను, అందులోని భవనాలను, ఇతరత్రా ఆస్తులను ప్రభుత్వానికి ఇస్తామని గౌతం రెడ్డి తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు.
Also Read: ఎన్టీఆర్ ను వాడుకొని చంద్రబాబు-లోకేష్ పై వైసీపీ దాడి?
దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం ఉదయగిరికి వచ్చిన సీఎం జగన్ తో గౌతంరెడ్డి ఫ్యామిలీ ఏకాంతంగా మాట్లాడింది. ఈక్రమంలోనే గౌతంరెడ్డి ఆస్తులను ప్రభుత్వానికి ఇస్తామని.. ఆయన పేరుతో యూనివర్సిటీ పెట్టాలని కోరినట్లు సమాచారం. తాము ఇచ్చే ఎకరాల స్థలంలో గౌతం రెడ్డి పేరిట వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
ఇక గౌతం రెడ్డి ఆశయమైన సోమశిల కెనాల్ ఫేజ్1, ఫేజ్ 2 పనులు పూర్తిచేయాలని కోరినట్లు తెలిసింది. ఈ విజ్ఞప్తికి స్పందించిన సీఎం జగన్ .. వెంటనే స్పందించారు. గౌతంరెడ్డి పేరిట ‘అగ్రికల్చర్ యూనివర్సిటీ’కి.. అలాగే ఆయన ఆశయాలను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. కొడుకు గౌతంరెడ్డి ఆశయాల కోసం ఏకంగా వందల కోట్ల ఆస్తులు ప్రభుత్వానికి స్వాధీనం చేసిన మేకపాటి కుటుంబంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Also Read: బీజేపీతో ఇక తెగదెంపులేనా..? దూరంగా ఉంటున్న పవన్? కారణం నాగబాబేనా?
Recommended Video: