https://oktelugu.com/

తల్లి పాత్రల్లో మెప్పించిన ఈ న‌టీమ‌ణులకి నిజ జీవితంలో మాత్రం పిల్లలు లేరని తెలుసా ?

Tollywood Heroines Who Don’t Have Kids: సినిమా రంగంలో కొన్ని పాత్ర‌లు కొంద‌రికే సూట్ అవుతాయ‌నేంత‌లా వారు అందులో న‌టించి మైమ‌రిపిస్తుంటారు. అయితే సినిమాల్లో అమ్మ పాత్ర‌ల్లో న‌టించిన కొంద‌రు న‌టుల‌కు మాత్రం నిజ జీవితంలో కూడా పిల్ల‌లు లేరు. అమ్మ పాత్ర‌ల్లో అంత‌టి సెంటిమెంట్ ను చూపించినా.. నిజ జీవితంలో మాత్రం అమ్మ కాలేక‌పోయిన వారి గురించి తెలుసుకుందాం. సీనియ‌ర్ ఎన్టీఆర్ హ‌యాంలో అమ్మ పాత్ర అంటే ఎక్కువ‌గా సూర్యాకాంతం గారే చేసే వారు. […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 26, 2022 / 12:35 PM IST
    Follow us on

    Tollywood Heroines Who Don’t Have Kids: సినిమా రంగంలో కొన్ని పాత్ర‌లు కొంద‌రికే సూట్ అవుతాయ‌నేంత‌లా వారు అందులో న‌టించి మైమ‌రిపిస్తుంటారు. అయితే సినిమాల్లో అమ్మ పాత్ర‌ల్లో న‌టించిన కొంద‌రు న‌టుల‌కు మాత్రం నిజ జీవితంలో కూడా పిల్ల‌లు లేరు. అమ్మ పాత్ర‌ల్లో అంత‌టి సెంటిమెంట్ ను చూపించినా.. నిజ జీవితంలో మాత్రం అమ్మ కాలేక‌పోయిన వారి గురించి తెలుసుకుందాం.

    సీనియ‌ర్ ఎన్టీఆర్ హ‌యాంలో అమ్మ పాత్ర అంటే ఎక్కువ‌గా సూర్యాకాంతం గారే చేసే వారు. అప్ప‌ట్లో ఏ హీరోకు అయినా అమ్మ పాత్ర అంటే ఆవిడ‌నే తీసుకునే వారంట‌. కానీ ఆమెకు మాత్రం జీవితంలో పిల్ల‌లు లేరు. అయినా స‌రే షూటింగులో ఉన్న వారినే త‌న సొంత బిడ్డ‌ల్లా చూసుకునే వారంట‌. ఇక ఆమె త‌ర్వాత ఆ స్థాయిలో అమ్మ పాత్ర‌ల్లో న‌టించింది నిర్మ‌ల‌మ్మ‌. చిరంజీవి, కృష్ణ త‌రంలో ఆమె అమ్మ పాత్ర‌లు బాగా చేసేవారు.

    Suryakantham

    కానీ ఆమె కూడా నిజ జీవితంలో అమ్మ అనిపించుకోలేక‌పోయింది. ఈమె త‌ర్వాత మ‌న‌కు అమ్మ పాత్ర‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించింది అన్న పూర్ణ‌మ్మ‌. ఆమెకు హీరోయిన్‌గా క‌న్నా కూడా అమ్మ పాత్ర‌ల్లోనే ఎక్కువ‌గా పేరు వ‌చ్చింది. దాంతో ఆమె ఎక్కువ‌గా అమ్మ పాత్ర‌లు చేసింది. దుర‌దృష్ణ వ‌శాత్తు ఆమెకు కూడా నిజ జీవితంలో పిల్ల‌లు లేరు.

    Also Read:  ప్చ్.. సినిమా టికెట్ల కోసం గొంతు కోయడం ఏమిటయ్యా ?

     

    Annapurna

     

    ఇక ర‌మా ప్ర‌భ అంద‌రికీ సుప‌రిచితురాలు. ఆమె మొద‌ట్లో కామెడీ క్యారెక్ట‌ర్లు బాగా చేసేది. శ‌ర‌త్ కుమార్‌ను పెండ్లి చేసుకున్న కొన్నాళ్ల‌కు ఇద్ద‌రూ విడిపోయారు. వేర్వేరుగానే బ‌తుకుతున్నారు. ఆమె అమ్మ పాత్ర‌ల్లో చాలా సినిమాల్లో న‌టించింది. నిజ జీవితంలో ఆమెకు పిల్లలు లేరు. ప్ర‌స్తుతం ఒంటరిగానే జీవిస్తోంది. ఇప్ప‌టికీ పూరి జ‌గ‌న్నాథ్ సినిమాల్లో ఆమె ఏదో ఒక క్యారెక్ట‌ర్ లో న‌టిస్తోంది. ఇక ఆమెకు అవ‌కాశాలు సరిగ్గా రాక‌పోవ‌డంతో పూరీ జ‌గ‌న్నాథ్ ఆమెకు నెల‌కు ఎంతో కొంత డ‌బ్బులు పంపిస్తున్నాడంట‌. ఎందుకు అని అడిగితే నేను మీ కొడుకు లాంటి వాడిని అని చెప్పి సాయం చేస్తున్నాడంట‌.

    Rama Prabha

     

    Also Read:  “భీమ్లా నాయక్” పై సినీ ప్రముఖుల ప్రసంసల వర్షం
    Recommended Videos


    Tags