Mekapati Goutham Reddy: ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష నేతలు రాజధాని ఎక్కడ అంటూ ప్రశ్నించడంతో ప్రభుత్వం మాత్రం ఏం చెప్పలేకపోతోంది. దీనికి మంత్రి మేకపాటి గౌతంరెడ్డి (Mekapati Goutham Reddy) మాత్రం సాధారణంగా సమాధానం చెబుతున్నారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని చెబుతున్నారు. దీంతో ప్రతిపక్షాలు సైతం అదే తీరుగా కౌంటర్ ఇస్తున్నాయి. అయితే జగన్ విశాఖపట్నంలో ఉంటే అదే రాజధాని అనుకుందామనకుంటే జగన్ కు అక్కడ ఇల్లు కూడా లేకపోవడంతో ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
దీంతో హైదరాబాద్, బెంగుళూరులో ఉంటే అవి కూడా రాజధానులేనా అని అడుగుతున్నారు. జగన్ విశాఖ వెళ్లి పరిపాలిస్తే అదే రాజధాని అని బావించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో మేకపాటి మాటల్లో ఆంతర్యమేమిటో తెలుగు తమ్ముళ్లకు అర్థం కావడం లేదు. మూడు రాజధానుల నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూడా ఎవరికి అర్థం కావడం లేదని తెలుస్తోంది. మంత్రి మాటలకు అందరిలో కూడా అనుమానాలు వస్తున్నాయి.
మంత్రి మేకపాటి వ్యాఖ్యలతో ఆశ్చర్యం వేస్తోంది. శ్రీభాగ్ ఒప్పందం గురించి తెలిస్తే మంత్రి ఇలా మాట్లాడేవారు కాదని తెలుస్తోంది. ఏపీలో పరిశ్రమలే రాకపోయినా అంబానీ, అదానీలను తయారు చేస్తామని ప్రకటనలు చేయడం కూడా సంచలనంగా మారుతోంది. వైసీపీ నేతల తీరుతో గందరగోళం పెరుగుతోంది. పొంతన లేని మాటలతో చులకన అవుతున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మేకపాటి క్లారిటీపై ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మతి ఉండే మాట్లాడుతున్నారా లేక మతి చలించి మాట్లాడుతున్నారో తెలియడం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు. ఇష్టారీతిగా మాట్లాడుతుండడంపై అందరిలో తమ స్థాయి దిగజారిపోతుందని తెలుసుకోలేకపోతున్నారు. మంత్రి పదవిలో ఉంటూ ఏమి తెలియని వాడిలా మాట్లాడడమేమిటని ప్రతిపక్షాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.