America Taliban: తాలిబన్లకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా ఎందుకు భయపడుతోంది..?

ప్రపంచంలోనే అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం.. అత్యంత ఆధునిక వ్యవస్థలు, రక్షణ పరికరాలు.. శత్రుదుర్భేధ్యమైన వ్యవస్థలు దాని సొంతం.. అలాంటి అమెరికా అప్ఘనిస్తాన్ లోని తాలిబన్లకు ఎందుకు భయపడుతోంది. ఆగస్టు 31లోపు టైం ఉన్నా కూడా 30వ తేదీ వరకే ఎందుకు పలాయనం చిత్తగించింది. గత చరిత్రలో పెద్ద పెద్ద యుద్ధాలను గెలిచిన అమెరికా తాలిబన్లకు ఎందుకు భయపడుతోంది..? వారి బలగాలను ఎందుకు వెనక్కి రప్పించుకుందన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తగా వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికానే తాలిబన్లకు భయపడితే […]

Written By: NARESH, Updated On : September 1, 2021 9:44 am
Follow us on

ప్రపంచంలోనే అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం.. అత్యంత ఆధునిక వ్యవస్థలు, రక్షణ పరికరాలు.. శత్రుదుర్భేధ్యమైన వ్యవస్థలు దాని సొంతం.. అలాంటి అమెరికా అప్ఘనిస్తాన్ లోని తాలిబన్లకు ఎందుకు భయపడుతోంది. ఆగస్టు 31లోపు టైం ఉన్నా కూడా 30వ తేదీ వరకే ఎందుకు పలాయనం చిత్తగించింది. గత చరిత్రలో పెద్ద పెద్ద యుద్ధాలను గెలిచిన అమెరికా తాలిబన్లకు ఎందుకు భయపడుతోంది..? వారి బలగాలను ఎందుకు వెనక్కి రప్పించుకుందన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తగా వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికానే తాలిబన్లకు భయపడితే ఇక మిగతా దేశాల సంగతేంటని? అందరూ ఆందోళన చెందుతున్నారు.

అప్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన మొదలైంది. ఇప్పటికే అమెరికా, ఇండియా తదితర దేశాలు తమ బలగాలను వెనక్కి తీసుకొచ్చాయి. ఇతరదేశాలకు చెందిన వారితో పాటు అప్గాన్లను తరలిస్తున్నాయి. మరోవైపు కాబుల్ లో ఆత్మాహుతి దాడులు, రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. వీటిని తాలిబన్లే విసురుతున్నారా..? లేక ఐఎస్ ముష్కరులా..? అన్నది క్లారిటీ లేదు. తాలిబన్లు మాత్రం మా పని కాదంటున్నారు. ఏదేమైనా ఈ దాడుల్లో అమాయకులతో పాటు అమెరికా సైనికులు మరణించారు. దీంతో అమెరికాకు తీవ్ర నష్టం జరిగినట్లేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా విషయంలో కొత్త చర్చ ప్రారంభమైంది.

1945 వరకు జరిగిన దాదాపు అన్ని యుద్ధాల్లో అమెరికాదే పైచేయి. ఆ తరువాత కొరియా, వియత్నాం, గల్ప్, ఇరాక్, అప్ఘనిస్తాలతో యుద్దాలు చేసి విజయం సాధించింది. 1991 గల్ఫ్ యుద్ధం వరకు అమెరికాకు తిరుగులేకుండా సాగింది. కానీ ఆ తరువాత నుంచి అమెరికా వెనుకడుగు వేస్తోంది. 1991 తరువాత జరిగిన చాలా యుద్ధాల్లో అమెరికా ఓడిపోయిందని అంటున్నారు. బెంఘాజీ, సోమాలియా, సైగాన్ ఇప్పుడు కాబుల్ నుంచి అమెరికా తన సేనలను నిష్క్రమించడం చూస్తే తన ఓటమిని ఒప్పుకున్నేట్లేనని అంటున్నారు.

ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు.. ఆర్థిక సంపద అమెరికా సొంతం. మరీ రాను రాను అమెరికా చిన్న దేశాలకు ఎందుకు భయపడుతోంది..? తన సేనలను వెనక్కు రప్పించడానికి కారణం ఏంటీ..? అనే విషయాలను పరిశీలిస్తే.. కాలంతో పాటు పాలకుల తీరుల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. దీంతో అమెరికా యుద్ధం చేసే దేశాల స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతుంది. దీంతో తాను పోరాడుతున్న దేశాల్లో విఫలమవుతోంది. జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ ప్రొఫెసర్ అప్తాబ్ కమల్ మాట్లాడుతూ ‘అమెరికా బలగాలు బాగ్దాద్ లో ప్రవేశించి షియా కమ్యూనిటీకి చెందిన సద్దాం హుస్సేన్ పై యుద్ధం చేసింది. ఆ తరువాత వారు సాధించిన విజయంగా చెప్పుకున్నారు. దీంతో తమని ప్రజలు పూల దండలతో సత్కరిస్తారని ఆ సమయంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ షెనీ, మాజీ రక్షణ మంత్రి డోనాల్డ్ రమ్స్ ఫెల్డ్ బహిరంగంగా చెప్పేవారు. కానీ వారనుకున్న విధంగా వారికి స్వాగతాలు లభించలేదు’ అని అన్నారు.

1993 అక్టోబర్లో అమెరికా దళాలు సోమాలియాతో జరిగిన యుద్ధంలో స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. దీంతో సొమాలియా అధ్యక్షుడి వరకు చేరుకోలేకపోయారు. ఈ సమయంలో 18 మంది అమెరికన్ సైనికులు మరణించారు. ఆరు నెలల్లోనే అమెరికా తన బలగాలను వెనక్కి రప్పించుకుంది.

ఇప్పుడు తాలిబన్ల విషయంలోనూ అమెరికా తప్పటడుగులు వేసింది. తాలిబన్లు చనిపోవడానికి లేదా.. చంపడానికి సిద్ధంగా ఉంటారు. వీరు యుద్ధానికి వచ్చేటప్పుడు కేవలం ముసుగు వేసుకొని చేతిలో తుపాకులతో వస్తారు. ఎలాంటి రక్షణ కవచాలు వేసుకోరు. అంతేకాకుండా తమ దేశం కోసం లేదా మత యుద్ధం అనుకొని రంగంలోకి దిగుతారు. అయితే అమెరికా మాత్రం తమ సైనికుల రక్షణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే అమెరికా సైనికులు తమ దేశం కోసం కాకుండా సాధారణ యుద్ధంలా చేస్తారు..అందుకే ఒక్కోసారి ప్రత్యర్థుల కంటే అమెరికా బలగాలే ఎక్కువగా నష్టపోవాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో అమెరికా ఇతర దేశాలతో యుద్ధం కంటే సంధి కుదుర్చుకోవడమే మేలని భావిస్తున్నట్లు సమాచారం. తాలిబన్లనతో అమెరికా ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించాలని కొందరు చెబుతున్నారు. అందుకు ఇటీవల కాబుల్ విమానాశ్రయం వెలుపల జరిగిన బాంబు పేళుళ్లే నిదర్శనమని అంటున్నారు. అయితే మరోసారి అమెరికా తన బలగాలను తాలిబన్లపైకి యుద్ధానికి పంపుతుందా.. అంటే ప్రస్తుతం ఆ ఆలోచన లేదనే వాదన వినిపిస్తోంది.

మొత్తంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా ఇప్పుడు ఎందుకు యుద్ధాలు చేస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో సైనికులను నెట్టివేస్తోంది. ఆ నిర్లప్తతతోనే సైనికుల్లో కూడా పోరాట స్ఫూర్తి కొరవడుతోంది. అంతిమంగా ఇది అమెరికా పలాయనం చిత్తగించేలా పురిగొల్పుతోంది.