Homeక్రైమ్‌Meghalaya incident: మూడుసార్లు ప్రయత్నించింది.. నాలుగోసారి అంతం చేసింది: మేఘాలయ ఘటనలో షాకింగ్ నిజం!

Meghalaya incident: మూడుసార్లు ప్రయత్నించింది.. నాలుగోసారి అంతం చేసింది: మేఘాలయ ఘటనలో షాకింగ్ నిజం!

Meghalaya incident: దేశవ్యాప్తంగా మేఘాలయ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో అవాక్కవడం పోలీసుల వంతవుతున్నది.

అప్పట్లో బాలీవుడ్లో ఓ సినిమా వచ్చింది. పెద్దలు మాత్రమే చూసే విధంగా ఆ చిత్రాన్ని రూపొందించారు. అందులో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన ప్రియుడు సహాయంతో భర్తను అంతం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. చివరికి దొరికిపోతుంది. ఆ సినిమా మాదిరిగానే సోనం వ్యవహరించినట్టు కేసు దర్యాప్తులో వెల్లడైన నిజాల ద్వారా తెలుస్తోంది. రఘు వంశీ తో వివాహం చేరడానికి అంటే ముందే సోనం ప్రేమలో ఉంది. అయితే ఆమె ప్రేమను ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. పైగా అతనితో వివాహం జరిపించడానికి ఏమాత్రం అంగీకరించలేదు. కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకురావడంతో రఘువంశీని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత అతడిని భర్తగా అంగీకరించలేకపోయింది. అంతేకాదు అతడిని అంతం చేస్తే ప్రియుడితో కలిసి జీవితాన్ని కొనసాగించవచ్చని తప్పుడు అంచనా వేసింది. ఇందులో భాగంగానే తన భర్తను హనీమూన్ నిమిత్తం మేఘాలయ తీసుకెళ్లింది. అక్కడ శారీరకంగా కలవడానికి ఒప్పుకోలేదు. పైగా కామాఖ్య దేవి ఆలయంలో పూజలు చేసిన తర్వాతే శారీరకంగా ఒక్కటవుదామని అతని ముందు ప్రతిపాదన ఉంచింది.. దీంతో అతడు ఆమె చెప్పినట్టు విన్నాడు. కామాఖ్య ఆలయానికి వెళ్ళినప్పుడు.. అక్కడే అతని అంతం చేయాలని భావించింది.. ఆ తర్వాత కూడా సోహ్రా అనే ప్రాంతంలో అంతం చేయడానికి ప్రయత్నించింది. దానికంటే ముందు గుహవాటి ప్రాంతంలోనే తొలిసారి అతని అంతం చేయాలని ప్రయత్నించింది. ఇలా మూడుసార్లు ఆమె ప్రయత్నాలకుఫలమయ్యాయి.

Read Also: ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం .. 10 కీలక అంశాలు ఇవీ

నాలుగో సారి అంతం చేసింది

రఘువంశని అంతం చేయడానికి మూడుసార్లు ప్రయత్నాలు చేయడం.. అవి విఫలం కావడంతో సోనం నాలుగోసారి గట్టి ప్రణాళిక రూపొందించింది. తన ప్రియుడిని మేఘాలయకు రప్పించుకుంది. అంతకుముందు నుంచి అతడు అక్కడ ఉంటున్నప్పటికీ.. నాలుగో సారి మాత్రం గట్టి ప్రణాళిక రూపొందించారు. రఘు వంశీని కావాలని కొండ ప్రాంతానికి తీసుకెళ్లిన సోనం.. ఆ తర్వాత అతడిని అక్కడే అంతం చేయించింది. ప్రియుడు, ఇతర నిందితులు రఘువంశీని అంతం చేస్తుండగా.. సోనం దగ్గరుండి చూసింది. అతడు చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత.. మేఘాలయ నుంచి వెళ్లిపోయింది. రకరకాల ప్రాంతాలు తిరిగింది. తన ఫోన్ కూడా పగలగొట్టింది. తనను ఎవరో అపహరించారు అనే నాటకం కూడా ఆడింది. అయితే పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సోనం అసలు వ్యవహారం బయటికి వచ్చింది. ఇక ప్రస్తుతం కస్టడీలో ఉన్న సోనం ను పోలీసులు విచారిస్తుండగా.. సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. కాగా సోనం ఈ స్థాయిలో దారుణానికి పాల్పడిన నేపథ్యంలో.. ఆమెపై ఎంత కఠినమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు రఘువంశీ కుటుంబాన్ని వారు పరామర్శించారు.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version