Chiranjeevi Godfather- YCP: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే నెల 5 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,హిందీ మరియు మలయాళం బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం లో ఘనంగా నిర్వహించగా..దానికి అభిమానుల నుండి మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ముఖ్యంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ మాట్లాడిన మాటలు, అభిమానుల్లో వెయ్యి వోల్టేజీల కరెంటు ని నింపింది..అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా..ఎప్పుడు టికెట్స్ బుక్ చేసుకుందామా అనే ఆతృతలో ఉన్నారు ఫాన్స్..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లో చిరంజీవి చెప్పిన డైలాగ్స్ కంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చెప్పిన గాడ్ ఫాదర్ లోని డైలాగ్ కి అభిమానుల నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది..సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఇప్పుడు దీని గురించే చర్చ.

ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి అంటే ‘ఇన్నాళ్లు రోడ్ కాంట్రాక్టులు,ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు,నెల కాంట్రాక్టులు, నీళ్ల కాంట్రాక్టులు,మందు కాంట్రాక్టులు అంటూ ప్రజల సొమ్ము ని అడ్డదిడ్డం గా తింటూ బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు..ఇక నుండి మీరు పీల్చే గాలి కాంట్రాక్టుని తీసుకుంటున్న..ఇందులో ఒకటే రూల్..ఇక నుండి ప్రజలకు సుపరిపాలన అందించాలనే నిర్ణయం, తప్పుచెయ్యాలంటే భయం మాత్రమే మీ మనస్సులో ఉండాలి.
Also Read: Anil Ravipudi- Balakrishna: బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా బడ్జెట్ ఇదే.. పైగా అమెరికాలో షూటింగ్

లేదంటే మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది’ అంటూ మెగాస్టార్ చిరంజీవి సీమ గడ్డ మీద నిన్న చెప్పిన డైలాగ్ గాడ్ ఫాదర్ సినిమాకి హైప్ ని తీసుకొని రావడమే కాకుండా..రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చ కి దారి తీసింది..ఈ డైలాగ్ అధికార వైసీపీ పార్టీ కి చురకలు అంటిస్తూ చిరంజీవి గారు కావాలని చెప్తున్నారా..జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటి నుండే రూట్ మ్యాప్ వేస్తున్నారా..అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి..ఇదే కనుక నిజమైతే జనసేన పార్టీ శ్రేణుల్లో ఒక సరికొత్త నూతనోత్సాహం నెలకొంటుంది..రాబొయ్యే రోజుల్లో చూడాలి మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది.