Mega Fans Unity : జనసేన కోసం మెగా ఫ్యాన్స్ ఐక్యత.. ఏపీ రాజకీయాల్లో సంచలనం

Mega Fans Unity:  ఇన్నాళ్లు చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టుగా మెగా అభిమానులు చీలిపోయారు. చిరంజీవి ఫ్యాన్స్, రాంచరణ్ ఫ్యాన్స్ మాత్రం ఐక్యంగా ఉండేవారు. ఇక వీరికి కాస్త దూరంగా అల్లు అర్జున్ అభిమానులు వ్యవహరించేవారన్న ప్రచారం ఉంది. ఇక వీరందరిదీ ఒకదారైతే.. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానులదీ సపరేట్ దారి. వారి జోలికి ఎవరూ రారు.. వీరితో ఎవ్వరూ కయ్యానికి కాలుదువ్వరు. ఇక వీరే కాదు.. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ సహా మిగతా […]

Written By: NARESH, Updated On : May 23, 2022 12:16 pm

Mega Fans Unity

Follow us on

Mega Fans Unity:  ఇన్నాళ్లు చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టుగా మెగా అభిమానులు చీలిపోయారు. చిరంజీవి ఫ్యాన్స్, రాంచరణ్ ఫ్యాన్స్ మాత్రం ఐక్యంగా ఉండేవారు. ఇక వీరికి కాస్త దూరంగా అల్లు అర్జున్ అభిమానులు వ్యవహరించేవారన్న ప్రచారం ఉంది. ఇక వీరందరిదీ ఒకదారైతే.. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానులదీ సపరేట్ దారి. వారి జోలికి ఎవరూ రారు.. వీరితో ఎవ్వరూ కయ్యానికి కాలుదువ్వరు.

ఇక వీరే కాదు.. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ సహా మిగతా మెగా హీరోలందరూ వేర్వేరు గ్రూపులుగా.. సంఘాలుగా విడిపోయి ఎవరికి వారు ఓన్ గా సెలబ్రేషన్స్ చేసుకునేవారు. దీనివల్ల మెగా ఫ్యాన్స్ లో అనైక్యత ఏర్పడుతుంది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఈ ఫ్యాన్స్ అనైక్యత మొత్తం మెగా కుటుంబానికే మైనస్ గా మారేది. వీరంతా ఒకే గొడుగు కిందకు వస్తే.. ‘మెగా ఫ్యాన్స్ ’అంతా ఒక్కటిగా మారితే ఆ బలం నిజంగానే ప్రత్యర్థులను భయపెట్టేలా ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది..

జనసేన కోసం మెగా అభిమానుల్లో ఐక్యత వచ్చింది. ఇన్నాళ్లు వేర్వేరుగా తమ అభిమాన తారలను ఆరాధించిన ఫ్యాన్స్ అంతా ఒక్కటయ్యారు. విజయవాడలో చిరంజీవి, పవన్ కళ్యాణ్,రాంచరణ్ సహా ఇతర మెగా హీరోల అభిమానులంతా సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యర్థులను భయపడేలా చేసింది. మురళీ ఫార్చూన్ హోటల్ లో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పరిమిత సంఖ్యలో మెగా ఫ్యాన్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అందరూ కలిసి ఒకటే తీర్మానం చేశారు. అది ‘జనసేన పార్టీకి’ ఉమ్మడిగా మద్దతుగా నిలవాలని డిసైడ్ అయ్యారు.

ఏపీలోని మెగా హీరోల అభిమానులు అంతా ఒకే గొడుకు కింద పనిచేయాలని.. జనసేన పార్టీని బలోపేతం చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయకుడు అధ్యక్షతన నిర్వహించడం విశేషం. ప్రతి గ్రామంలో అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించామని.. జనసేనను జనంలోకి తీసుకెళ్లేలా మా వంతు కృషి చేస్తామని ప్రకటించారు.

ఈ సమావేశంలో చేసిన కీలక తీర్మానం ఏంటంటే.. 2024లో పవన్ కళ్యాణ్ ను సీఎంను చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇది తొలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం. మరికొన్ని సమావేశాలు అనంతరం కార్యాచరణ సిద్ధం చేస్తామని స్వామి నాయుడు ప్రకటించారు.

ఇన్నాళ్లు సినిమాలు, రాజకీయాన్ని అభిమాన సంఘాలు వేర్వేరుగా చూశాయి. దీనివల్ల జనసేనకు నష్టం జరిగింది. సినీ అభిమానులు పార్టీల వారీగా విడిపోవడంతో ఆ ఓటు బ్యాంకు జనసేనకు మరలలేదు. అందుకే ఈ మెగా ఫ్యాన్స్ ఐక్యతతో ఇక అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు తగ్గించే పని కొనసాగింది. ఇక నుంచి అంతరాలు లేవని.. పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళ్లాలని మెగా ఫ్యాన్స్ ప్రకటించారు.

Also Read: Amit Shah, Rahul Are Political Tourists: అమిత్ షా, రాహుల్ పొలిటికల్ టూరిస్టులు.. మరి కేసీఆర్?

గతంలో ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు ఇలానే అభిమాన సంఘాలను విడదీసి కుట్రలు చేశారు. ఈసారి అలాంటి కుట్రలకు తావివ్వకుండా జనసేన కోసం మెగా ఫ్యాన్స్ ఏకమవ్వడం తెలుగురాజకీయాల్లోనే ఒక పెద్ద స్టెప్ గా అభివర్ణిస్తున్నారు. వీరు ఐక్యంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ కావడం జనసేనకు కొండంత బలం. మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ వెంట నడుస్తుండడం ఆ పార్టీకి తిరుగులేని శక్తినిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పొత్తులతో సంబంధం లేకుండా కేవలం మెగా ఫ్యాన్స్ అంతా జనసేన వెంట నడవాలన్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది.

ఇన్నాళ్లు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ సహా మిగతా అభిమానులు వేర్వేరుగా ముందుకెళ్లేవి. కానీ ఇప్పుడు ఐక్యతతో వీరు ఒకేగూటికి చేరడం ఏపీలో రాజకీయ వేడి పుట్టేలా చేసింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్న వేళ ఇలా ఫ్యాన్స్ అంతా ఒకేగూటికి చేరడంతో అది జనసేనకు భవిష్యత్తులో ఏంతో మేలు చేయనుంది. ఈ అభిమాన సంఘాలన్నింటిని సమన్వయం చేసే బాధ్యతను స్వామినాయుడుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. జనసేన అధికారంలోకి వస్తే ఈ అభిమాన సంఘాలకు పెద్ద ఎత్తున పదవులు ఇవ్వడానికి జనసేన అంగీకరించిందట.. సో ఇక పవన్ గెలుపుకోసమే వీరంతా కలిసి పనిచేయనున్నారు.

Also Read: Jeevita Rajasekhar జీవితా రాజశేఖర్ కు షాక్.. ‘శేఖర్’ మూవీ నిలిపివేత

Recommended Video: