Homeజాతీయ వార్తలుMinister kTR: కేటీఆర్‌ చైనా జపం.. ఆయన వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?

Minister kTR: కేటీఆర్‌ చైనా జపం.. ఆయన వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?

Minister kTR: తెలంగాణలో కుటుంబ పాలన నాగుతోందని, కేసీఆర్‌ కుటుంబం మాత్రమే తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడిందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఎక్కడ పబ్లిక్‌ మీటింగ్‌ పెట్టినా చైనా పేరును జపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అభివృద్ధి విషయంలో పోల్చుకునే రాజకీయ నేతలు అమెరికా, జపాన్, రష్యాను ఎక్కువగా ఉదాహరణగా తీసుకుంటారు. తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖమంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుడిగా గుర్తింపు ఉన్న కేటీఆర్‌ మాత్రం చైనాను ఉదాహరణగా తీసుకుంటున్నారు. అదీ భారత దేశంలో చైనా కయ్యం పెట్టుకుంటున్న సమయంలో చైనా నామస్మరణ ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Minister kTR
Minister kTR

సొంత రాజ్యాంగ రచనలో వ్యూహమేనా..

తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పాలనా పరంగా కొన్ని సంఘటనలు కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇదే సమయంలో దేశ రాజ్యాంగం మార్చాలని కూడా కేసీఆర్‌ ఇటీవల డిమాండ్‌ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి తర్వాత కేసీఆర్‌ దానిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం సొంతరాజ్యాంగం అమలుపైనే ఎక్కువ దృష్టి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందుకు కేటీఆర్‌ తరచుగా చైనా పేరు స్మరించడం కూడా నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Namrata Re-Entry Into Movies: షాకింగ్.. సినిమాల్లోకి నమ్రతా రీ ఎంట్రీ.. తొలి సినిమా ఎవరితోనో తెలుసా..?

చైనాలో శాశ్వత అధ్యక్షుడిగా రాజ్యాంగ సవరణ..

చైనాలో జిన్‌పింగ్‌ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన జీవిత కాల అధ్యక్షుడిగా రాజ్యాంగాన్ని మార్చుకున్నారు. ఇదే స్పూర్తితో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దేశ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కేసీఆర్‌గానీ, కేటీఆర్‌గానీ అభివృద్ధి విషయంలో తరచూ చైనాతో దేశాన్ని పోలుస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. అయితే అభివృద్ధి మంత్రం వెనుక అసలు విషయం మాత్రం రాజ్యాంగ మార్పు, శాశ్వత ముఖ్యమంత్రి, శాశ్వత ప్రధాన మంత్రి, శాశ్వత రాష్ట్రపతి అనే విధానం టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కల్నల్‌ సంతోష్‌బాబు మరణానికి కారణమైనా..

Minister kTR
Colonel Santosh Babu

తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు మరణానికి చైనా సైన్యమే కారణం. మరోవైపు చైనా భారత భూభాగంలోకి చొరబడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. భారత సైన్యం దానిని ఎప్పటికప్పుడు తిప్పు కొడుతోంది. ఈ నేపథ్యంలో కేసీర్, కేటీఆర్‌ చైనా జపం చేయడంపై తెలంగాణ ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చైనా విధానాలు గొప్పవా అంటే అది కూడా లేదు.

చైనా అభివృద్ధి అంతా అడ్డదారే..

చైనా, భారత దేశం 1995లో అభివృద్ధి విషయంలో సమానంగా ఉండేవని ఖమ్మం సభలో కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 430 బిలియన్‌తో సమానంగా ఉన్న రెండు దేశాలు.. చైనాలో అనుసరిసుతన్న ఆర్థిక విధానాలతో ఆదేశం అభివృద్ధిలో దూసుకుపోయిందని చెప్పారు. ఇప్పుడు 4 నుంచి 5 రెట్లు అధికంగా భార™Œ కంటే ముందు ఉందని వ్యాఖ్యానించారు. నిజమే కావొచ్చ. కానీ చైనా అభివృద్ధి అంతా దొడ్డిదారినే జరుగుతోంది. చైనా తయారు చేసే వస్తువులన్నీ నాసిరకమైనవే. చైనా తయారు చేస్తున్న యాప్స్‌ కూడా అంతే. వారి ఆలోచన అంతా అడ్డదారిలో మరో దేశాన్ని ఎదగకుండా చేయడమే. ఆ విధానాన్ని కేటీఆర్‌ ఆదర్శంగా తీసుకోడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంటే దేశం కూడా నాసికరం వస్తువులు తయారు చేయాలి, దేశీయులంతా అడ్డదారిలో నడవాలి అనే సంకేతం ఇచ్చేలా ఉంది కేసీఆర్‌ తీరు.

Also Read: New Name For KCR: కేసీఆర్‌కు కొత్తపేరు.. తండ్రి పేరు మార్చిన తనయుడు కేటీఆర్‌!!

RELATED ARTICLES

Most Popular