నగరంలో తెరలేచిన మాస్కుల దందా

కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ఓ వైపు బెంబేలెత్తిపోతుంటే.. సందట్లో సడేమియాగా మరోవైపు మాస్కులు దందా మొదలైంది. చైనా సోకిన కరోనా వైరస్(కోడ్-19) క్రమంగా అన్నిదేశాలకు విస్తరిస్తుంది. ఇప్పటికే 60దేశాల్లో కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే 3వేల మంది మృత్యువాతపడ్డారు. 90వేలపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మహ్మమ్మరి ఇండియాలోకి ప్రవేశించడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ నగరానికి చేరుకుంది. సికింద్రాబాద్‌లోని మహేంద్రహిల్స్‌కు చెందిన […]

Written By: Neelambaram, Updated On : March 7, 2020 11:30 am
Follow us on

కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ఓ వైపు బెంబేలెత్తిపోతుంటే.. సందట్లో సడేమియాగా మరోవైపు మాస్కులు దందా మొదలైంది. చైనా సోకిన కరోనా వైరస్(కోడ్-19) క్రమంగా అన్నిదేశాలకు విస్తరిస్తుంది. ఇప్పటికే 60దేశాల్లో కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే 3వేల మంది మృత్యువాతపడ్డారు. 90వేలపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మహ్మమ్మరి ఇండియాలోకి ప్రవేశించడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

కరోనా వైరస్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ నగరానికి చేరుకుంది. సికింద్రాబాద్‌లోని మహేంద్రహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా సోకి బాధపడుతున్నాడు. దీంతో ఆ కాలనీలో ఉన్న స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు మహేంద్రహిల్స్‌లో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు. అయినప్పటకీ కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా భావించిన నగరంలోని కొన్ని మెడికల్‌ షాపుల నిర్వాహకులు మాస్కుల దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాస్కులు ధరించాలని సూచిస్తుంటంతో ప్రజలు మాస్కులు కొనేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. దీంతో సాధారణంగా రూ.5 ఉండే మాస్కులను రూ.20కి విక్రయిస్తున్నారట. కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు మాస్కులు, శానిటైజర్‌లు ఉంచుకొని కూడా అమ్మడం లేదని సమాచారం. ఇదిలా ఉండగా నగరంలోని ఒమెగా ఆస్పత్రి మెడికల్‌ షాపులో ఓ వ్యక్తి మాస్క్‌ కావాలని అడగగా ప్రిస్ర్కిప్షన్‌ లేనిది ఇవ్వబోమని చెప్పడం గమనార్హం. ఓవైపు కరోనా వైరస్ సోకుతుందని భయాందోళన చెందుతుంటే నగరంలో పలు మెడికల్‌ షాపుల్లో అధిక ధరలకు మాస్కులు విక్రయించడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోని ప్రజలందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని కోరుతున్నారు.