Marri Shashidar Reddy: సనత్‌నగర్ నియోజకవర్గంలోని భోయిగూడలోని గోడౌన్‌లో ఈరోజు తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో బీహార్‌కు చెందిన 11 మంది వలస కూలీలు మరణించడం దిగ్భ్రాంతికరమని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. ప్రాణాలతో బయటపడిన ఒంటరి వ్యక్తి గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చేరాడని తెలిపారు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ దుర్ఘటనకు గల కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఆ ఆస్తిని విక్రయించాలంటూ కొందరు సదరు యజమానిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, విధ్వంస కోణంలో పరిశీలించాలని అధికారులను శశిధర్ రెడ్డి కోరారు.

2014 నుంచి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం, ఐపీసీ 307 కేసుతో పాటు బెదిరింపు చర్యలు కూడా ఉన్నాయి. వీటన్నింటిలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు పాల్గొన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులు రెండు విధ్వంసాలకు పాల్పడ్డారని ఇటీవల హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను కలిశాను.
ఆస్తిని విక్రయించడానికి ఈ అనుమానిత ఘటన జరగవచ్చని.. వారి ప్రమేయం ఉండవచ్చని శశిధర్ రెడ్డి ఆరోపించారు. నేను వ్యక్తం చేసిన కొన్ని అనుమానాల నేపథ్యంలో, విధ్వంస కోణం నుంచి సమగ్ర విచారణ చేయడానికి ఆధునిక సాంకేతికత అందుబాటులో తీసుకొని విచారించాలని కోరారు. ఈ డిమాండ్ కోసం రేపు సీపీ హైదరాబాద్‌ను కలుస్తానని శశిధర్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత, ఈ విషయాలన్నింటినీ ఆమె దృష్టికి తీసుకువెళ్లి, ఈ విషయంలో జోక్యం చేసుకోవలసిందిగా అభ్యర్థించడానికి కూడా నేను ప్లాన్ చేస్తున్నాను మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.
Also Read: Rashi Khanna: వాళ్ళు నన్ను ఏదేదో అనేవాళ్లు – రాశీ ఖన్నా
[…] […]
[…] […]
[…] IT Raids Tension In TRS: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఐటీ దాడుల అలజడులు రేగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ దాడులు టీఆర్ ఎస్ నేతలను టార్గెట్ చేసినట్టు జరుగుతుండటం కలకలం రేపుతోంది. గతంలో కూడా ఇలాంటి దాడులే జరిగాయి. ఇప్పుడు కేసీఆర్ కేంద్రం మీద ఒంటికాలుపై లేస్తున్న క్రమంలో ఈ దాడుటు జరగడం సంచలనం రేపుతోంది. […]
[…] […]