https://oktelugu.com/

Maoist : భద్రాచలం మెడికల్ మాఫియాకు మావోయిస్టుల హెచ్చరిక

Maoist : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మెడికల్ మాఫియాను మావోయిస్టులు ఓ ప్రకటనలో హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ(బికె-ఎఎస్పార్)పేరిటి ఒ ప్రకటన విడుదల చేసారు. ప్రకటన సారాంశం…. భద్రాచలంలోని ఆసుపత్రులు మెడికల్ మాఫియాకు అడ్డాగా మారాయని,డబ్బుకోసం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు పద్దతి మార్చుకోకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మూడురాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం పూర్తిగా ఏజెన్సి ప్రాంతమని,గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.ప్రజల అనారోగ్యాన్ని బూచిగా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 17, 2023 / 10:56 PM IST
    Follow us on

    Maoist : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మెడికల్ మాఫియాను మావోయిస్టులు ఓ ప్రకటనలో హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ(బికె-ఎఎస్పార్)పేరిటి ఒ ప్రకటన విడుదల చేసారు. ప్రకటన సారాంశం…. భద్రాచలంలోని ఆసుపత్రులు మెడికల్ మాఫియాకు అడ్డాగా మారాయని,డబ్బుకోసం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు పద్దతి మార్చుకోకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మూడురాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం పూర్తిగా ఏజెన్సి ప్రాంతమని,గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.ప్రజల అనారోగ్యాన్ని బూచిగా చూపి రోగులను భయభ్రాంతులకు గురిచేసి ప్రజల రక్తం తాగుతున్నారని అన్నారు.

    ఛత్తీస్ఘడ్,ఒరిస్సా,ఆంధ్ర ప్రాంత గిరిజనులు,గిరిజనేతరులతో పాటు స్థానిక తెలంగాణ ప్రాంత ప్రజలను వైద్యం పేరుతో రోజుల తరబడి ఆసుపత్రుల్లో ఉంచి అవసరం లేకున్నా రకరకాల పరీక్షలు చేస్తూ ల్యాబులు,ఆసుపత్రులు,వైద్యులు ప్రజలను డబ్బుల కోసం పీడిస్తున్నారని అన్నారు.ప్రజల ప్రాణాలు ఇప్పుడు ఆసుపత్రులకు డబ్బులు కురిపించే ఏటిఎంలుగా మారాయని అన్నారు.ప్రజల నమ్మాకాన్ని వమ్ముచేస్తూ కొందరు డాక్టర్లు రాక్షసులు గా తయారయ్యారని పేర్కొన్నారు.

    ఉన్నోళ్లు,లేనోళ్లు అనే తేడాలేకుండా రోగుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారని అన్నారు.రకరకాల పరీక్షలతో రోగులను భయభ్రాంతులకు గురీచేస్తూ వైద్యులు తమ గళ్ల పెట్టెలు నింపుకుంటున్నారని,ప్రైవేటు ఆసుపత్రి మెదలుకొని ప్రభుత్వ ఆసుపత్రి వరకు కాసులకు కక్కుర్తి పడిన కొందరు వైద్యులు జనాలను పీడించుకు తింటున్నారని అన్నారు.ముఖ్యంగా భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే డాక్టర్లు తమ సొంత క్లీనిక్కులకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి పనివేళలను విస్మరిస్తున్నారని అన్నారు.

    ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు సమయానికి వైద్యం అందించకుండా రోగుల్లో లేనిపోని భయాలను స్రుష్టిస్తూ తమ సొంత దావఖానాలకు తరలిస్తున్నారని అన్నారు.ముఖ్యంగా మెడికల్ మాఫియాగా మారిన వైద్యవ్రుత్తి ఫార్మా కంపెనీలతో
    కుమ్మక్కై తక్కువ ధరలకు అమ్మాల్సిన మందులను బ్రాండ్ల పేర్లతో అధిక ధరలకు అమ్ముతున్నారని పేర్కొన్నారు.తమవద్దకు వచ్చే రోగులకు నోటికి వచ్చిన టెస్టుల పేర్లు చెప్తూ…చేతికి వచ్చిన ఖరీదైన మందుల పేర్లు రాస్తూ పేదప్రజలను రాబందుల్లా పీక్కు తింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. “ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే డాక్టర్లు వారి సమయాన్ని పూర్తిగా ప్రభుత్వాసుపత్రుల్లో కేటాయించకుండా ఇలానే ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని,గిరిజన ప్రాంతమైన భద్రాచలం ప్రాంతంలో సంపాదనే ధ్యేయంగా ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటుచేసి ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కోట్లకు పడగెత్తిన డాక్టర్లు,ల్యాబ్,మెడికల్ షాప్ యజమానులు తమ పద్దతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టు కార్యదర్షి ఆజాద్ ప్రకటనలో హెచ్చరించారు.

    -శ్రీరాముల కొమురయ్య