https://oktelugu.com/

అదే జరిగి ఉంటే విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఎంతో మంది బ్రతికేవారు..!

ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ ఏలూరు రోడ్డు లోని కళా స్వర్ణ ప్యాలస్ లో జరిగిన ఘటన రాష్ట్రాన్ని షాక్ కు గురి చేసింది. రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ గా స్వర్ణ ప్యాలెస్ ను లీజుకు తీసుకుని వైరస్ బాధితుల కు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి రోగులకు ఇలా ఫైర్ యాక్సిడెంట్ ద్వారా ప్రాణాలు కోల్పోవడం నిజంగా అందరి హృదయాలను కలచివేసింది. ఇక తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 10 మంది […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 9, 2020 / 01:06 PM IST
    Follow us on

    ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ ఏలూరు రోడ్డు లోని కళా స్వర్ణ ప్యాలస్ లో జరిగిన ఘటన రాష్ట్రాన్ని షాక్ కు గురి చేసింది. రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ గా స్వర్ణ ప్యాలెస్ ను లీజుకు తీసుకుని వైరస్ బాధితుల కు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి రోగులకు ఇలా ఫైర్ యాక్సిడెంట్ ద్వారా ప్రాణాలు కోల్పోవడం నిజంగా అందరి హృదయాలను కలచివేసింది. ఇక తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 10 మంది చనిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి ప్యాలెస్ వద్దకు చేరుకున్నా కూడా… మంటల తీవ్రత ఎక్కువ కావడంతో వారు అందరినీ కాపాడలేకపోయారు.

     

    ఇకపోతే ప్రమాద సమయంలో రోగులు, వైద్యం అందిస్తున్న వారు కలుపుకుని మొత్తం 50 మంది వరకూ ఆ భవనం లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాద వివరాలను ఏపీ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన మరియు అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ నాయక్ మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని వివరించారు. స్వర్ణ ప్యాలెస్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి తర్వాత సగం భాగం వరకు భవనం పూర్తిగా కాలిపోయింది అని చెప్పారు.

    ఇక ఇలాంటి అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు మోగాల్సిన ఫైర్ అలారం మోగలేదని…. అలాగే ఎమర్జెన్సీ బ్యాక్ డోర్ తెచ్చుకోవడంతో జాప్యం జరిగిందని దాని వల్లనే ఇంత నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆ రెండూ కనుక సరిగ్గా పనిచేసి ఉంటే అందరూ అలెర్ట్ అయి తక్షణమే భవనం ఖాళీ చేసేవారని ఒక్క ప్రాణానికి కూడా అపాయం జరిగేది కాదని చెబుతున్నారు. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో మొదటి అంతస్తులో ఉన్న వారంతా భవనం నుండి కిందకు దూకేశారు. ఇక మెట్ల మీద నుండి వచ్చే వీలు కూడా లేక పై అంతస్తులో ఉన్న వారు అలాగే మంటల్లో చిక్కుకొని కాలిపోగా మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి తెలుస్తోంది.

    ఇక ఈ విషయమై ప్రధాని మోడీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వం తక్షణమే 50 లక్షల రూపాయలను బాధితుల కుటుంబాలకు అందిస్తామని ప్రకటించగా అసలు ఇటువంటి ఘటనలు జరగకుండా హోటల్ యాజమాన్యం మీద తీసుకునే చర్యలు గురించి ఏమి ఇంకా ప్రస్తావించకపోవడం గమనార్హం.