ఒకపక్క విమర్శలు వెల్లువెత్తుతున్నా.. సమంతతో పాటు ఈ సిరీస్ మేకర్స్ కూడా సైలెంట్ గానే ఉన్నారు. దాంతో తమిళనాడులో ఈ వెబ్ సిరీస్ ను నిషేధించాలంటూ ఇప్పటికే అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఒక వెబ్ సిరీస్ పై ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అంటే నిజంగా షాకింగ్ విషయమే.
తాజాగా ఈ వెబ్ సిరీస్ పై సీనియర్ దర్శకుడు భారతీరాజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనదైన శైలిలో ఓ ప్రకటన కూడా పోస్ట్ చేశాడు. ‘యావత్తు తమిళ జాతికి వ్యతిరేకంగా రూపొందిన ‘ది ఫ్యామిలీ మెన్ 2’ సిరీస్ ను ప్రసారం చేయవద్దని తమిళ సమాజం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వెబ్ సిరీస్ పై నిషేధం విధించకపోవడం నిజంగా ఎంతో బాధాకరమని భారతీరాజా అన్నారు.
అలాగే ఆయన ఈ వెబ్ సిరీస్ ను తమిళ ద్రోహులు రూపొందించిన వెబ్ సిరీస్ గా పేర్కొంటూ.. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఈ వెబ్ సిరీస్ పై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా ఈ క్లాస్ డైరెక్టర్ ఓ మాస్ డైలాగ్ కూడా చెప్పారు. ఈ సిరీస్ ప్రసారాన్ని ఆపకుంటే అమెజాన్ సంస్థ పై పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమంటూ యాక్షన్ హీరో రేంజ్ లో ఓ భారీ హెచ్చరికను కూడా జారీ చేశారు.