Maharashtra Elections Result 2024 : మహారాష్ట్ర ఎన్నికలు ఈసారి రెండు కూటముల మధ్య జరిగాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ మధ్య కీలక పోరు జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో మరాఠాలు మహా వికాస్ అఘాడీకి షాక్ ఇచ్చారు. శరద్‌పవార్, ఉద్ధవ్ థాక్రే పార్టీల అభ్యర్థులతోపాటు కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు. మరోసారి ఎన్డీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఒకవైపు మహాయుతి పార్టీలు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు మహా వికాస్ అఘాడీ పార్టీలో నైరాశ్యం నెలకొంది. తనకు ఇవే చివరి ఎన్నికలని శరద్‌పవార్ ప్రకటించినా.. మరాఠా ఓటరుల పట్టించుకోలేదు.
భారీ మెజారిటీ..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించడమే కాకుండా భారీగా సీట్లు సాధిస్తోంది. ఈసారి బీజేపీ ఒంటరిగా 120 సీట్లలో ఆధిక్యంలో ఉంది. శివసేన(ఏక్‌నాథ్‌షిండే), ఎన్‌సీపీ(అజిత్‌పవార్) పార్టీలు కూడా 56, 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో మహాయుతి కూటమి 223 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కేవలం 52 స్థానాలకే పరిమిమైంది.
మహాయుతి విజకం వెనుక..
ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయానికి చాలా అంశాలే కలిసి వచ్చాయి. ఈ ఎన్నికలోల మూడు పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేశారు. మేనిఫెస్టోలో కూడా అసాధ్యం కాని హామీలు ఇవ్వలేదు. ఇవే విజయంలో కీలకపాత్ర పోషించాయి. లాడ్లీ బెహనా యోజన పథకం, మమిళలకు రూ.2,199 ఆర్థిక సాయం ప్లస్ అయ్యాయి. కులగణను మరాఠాలు వ్యతిరేకించారు. ఈమేరకు మోదీ ఏక్తో సేఫ్ హై నినాదం ఫలించింది. ఓబీసీలు, ఆదివాసీలను విభజిస్తే నష్టమని మోదీ ప్రకటించారు. ఇది మహా ఓటర్లను ప్రభావితం చేసింది.