Game Changer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇక్కడ భారీ అంచనాలతో వాళ్ళ సినిమాలను రిలీజ్ చేసినప్పటికి అవి పెద్ద సక్సెస్ లను సాధించకపోవడం విశేషం… మరి ఇలాంటి సందర్భంలోనే చాలామంది హీరోలు పాన్ ఇండియా లో తమ గుర్తింపును చాటుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మరి కొంతమంది మాత్రం వాళ్ల సినిమాలతో సక్సెస్ లను అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా రూపొందుతుంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంత పెద్ద బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు. కారణం ఏంటి అంటే శంకర్ గత సినిమా అయిన ‘భారతీయుడు 2’ సినిమా భారీ డిజాస్టర్ ను మూటకగట్టుకోవడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు లేకుండా పోతున్నాయి. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఈ సినిమాలో ప్రేక్షకుల ఊహకందని కొన్ని సీన్లని ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరమైతే ఉంది. రోబో సినిమాలో ఎలాంటి ఎలివేషన్స్ ను వాడుతూ ఎమోషన్స్ ను క్రియేట్ చేశాడో ఈ సినిమాలో కూడా అలాంటి ఒక మ్యాజిక్ జరిగితే తప్ప ఈ సినిమా ఆశించిన మేరకు విజయం అయితే సాధించదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక దాదాపు పది సంవత్సరాల నుంచి ఒక సక్సెస్ ని కూడా సాధించలేకపోతున్న శంకర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తేనే ఆయన మార్కెట్ అనేది పదిలంగా ఉంటుంది. లేకపోతే మాత్రం భారీగా పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న రామ్ చరణ్ మీదనే ఈ సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాలి అంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ను చాలా వైల్డ్ గా చూపిస్తే మాత్రం సినిమా అద్భుతంగా ఉంటుందని రామ్ చరణ్ క్యారెక్టర్ ని మలిచిన విధానం కూడా అద్భుతంగా ఉంటే మాత్రం ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కేవలం రామ్ చరణ్ స్టామినా మీదనే ఈ సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉందనేది వాస్తవం…