spot_img
Homeజాతీయ వార్తలుMann Ki Baat: ప్రధాని నోట బ్రియాన్‌ డి ఖర్ర్ పాన్‌ పేరు.. మన్‌కీ...

Mann Ki Baat: ప్రధాని నోట బ్రియాన్‌ డి ఖర్ర్ పాన్‌ పేరు.. మన్‌కీ బాత్‌లో ప్రస్తావన.. ఇంతకీ ఎవరీయన?

Mann Ki Baat: ప్రధాని నరేంద్రమోదీ తనకు ఇష్టమైన మన్‌కీ బాత్‌ కార్యక్రమం ఇటీవలే వందో ఎపిసోడ్‌ పూర్తిచేసుకుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ రంగాల్లో నిపుణులను, మరుగున పడిన వారిని మోదీ వెలుగులోకి తెస్తున్నారు. దేశానికి పరిచయం చేస్తున్నారు. తాజాగా ఆదివారం నిర్వహించిన మన్‌కీ బాత్‌ 104వ ఎపిసోడ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మేఘాలయవాసి బ్రియాన్‌ డి ఖర్ర్‌పాన్‌పై ప్రశంసలు కురిపించారు. బ్రియాన్‌∙తన బృందంతో కలిసి మేఘాలయాలో 1700లకు పైగా గుహలను కనుగొన్నారని చెప్పారు. బ్రియన్‌ చేసిన సేవలను కొనియాడారు. మేఘాలయ గుహలను సందర్శించాలని దేశ ప్రజలను కోరారు.

ఇంతకీ.. ఎవరీ బ్రియాన్‌ డి ఖర్ర్‌పాన్‌?
మన్ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ బ్రియాన్‌ గురించి చెప్పారు. 1964లో పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే బ్రియాన్‌ డి ఖర్ర్‌పాన్ గుహలను కనుగొనడం ప్రారంభించారు. 1990 నాటికి ఆయన తన స్నేహితులతో కలిసి ఓ సంఘాన్ని స్థాపించారు. వారందరూ కలిసి మేఘాలయాలో బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో గుహలను వెలుగులోకి తీసుకువచ్చారు. ‘బ్రియాన్‌ డి ఖర్ర్‌పాన్‌ తన బృందంతో కలిసి 1700పైగా గుహలను కనిపెట్టారు. ప్రపంచ పటంలో మేఘాలయా గుహలకు స్థానం వచ్చింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అత్యంత లోతైన, పొడవైన గుహలు ఉన్నాయి’ అని ప్రధాని మోదీ చెప్పారు.

టూరిస్టులకు వినతి..
టూరిస్టులు మేఘాలయా గుహలను తమ ప్రణాళికలో భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. దేశంలోనే చాలా పొడవైన, లోతైన గుహలు మేఘాలయాలో ఉన్నాయని తెలిపారు. అది బ్రియాన్‌ చేసిన కృషి ఫలితమేనని అన్నారు. మేఘాలయ అడ్వెంచరర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేసిన బ్రియాన్‌ డి ఖర్ర్‌పాన్‌ ఇప్పటివరకు రాష్ట్రంలోని 537.6 కి.మీ గుహలను చుట్టివచ్చారు.

Recommended Video:
ఇండియా టుడే అంచనాలకు మించి మోడీకి అధిక సీట్లు - ఎందుకో తెలుసుకుందాం | PM Modi | India Today|Ram Talk

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version