Homeజాతీయ వార్తలుManipur Violence: మణిపూర్‌ హింస.. పోటీపడుతున్న రాష్ట్రాలు!

Manipur Violence: మణిపూర్‌ హింస.. పోటీపడుతున్న రాష్ట్రాలు!

Manipur Violence: హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింస చెలరేగింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలతో ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. ప్రార్థనా స్థలాలు, వాహనాలకు నిరసనకారులు నిప్పంటించి భారీగా ఆస్తి, ప్రాణనష్టం కలిగించారు. ఈ హింసను అదుపుచేయడానికి పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను మోహరించారు. ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. అవసరమైతే ‘కనిపిస్తే కాల్చివేత’కు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల పాటు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్నవారిని సొంత రాష్ట్రాలకు తీసుకురావడానికి రాష్ట్రలు పోటీ పడుతున్నాయి.

22 మంది మహారాష్ట్రవాసులు..
మణిపూర్‌లో మహారాష్ట్రకు చెందిన 22 మంది విద్యార్థులు ఉన్నారు. వారిని తీసుకురావడానికి మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదట 22 మందిని అసోంకు విమానంలో తరలించి, ఆపై ఇంటికి తీసుకురావడానికి ప్రణాళిక రూపొందించబడింది. వీరిలో 14 మంది విద్యార్థులను ఇంఫాల్‌లోని శివసేన కార్యాలయానికి తరలించినట్లు సీఎం ఏక్‌నాథ్‌ షిండే కార్యాలయం తెలిపింది.

మణిపూర్‌లో చిక్కుకున్న వికాస్‌శర్మ, తుషార్‌ అవద్‌తో ఏక్‌నాథ్‌షిండే స్వయంగా మాట్లాడారు. ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భయపడవద్దని ధైర్యం చెప్పారు.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వందల మంది..
మణిపూర్‌లో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వందలాది మంది.. చిక్కుకున్నారు. వారిని తీసుకురావడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా చర్యలు తీసుకుంటున్నారు. లక్నోకు చెందిన అర్పిత్‌ ఇంఫాల్‌లోని తన హాస్టల్‌ నుంచి సీఎంతో మాట్లాడారు. ‘మాకు సరైన ఆహారం మరియు నీరు లభించడం లేదు‘ అని చెప్పాడు. హాస్టల్‌ క్యాంపస్‌లోనే యూపీకి చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన యోగీ వెంటనే విద్యార్థులను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
దీంతో యూపీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సంజయ్‌ప్రాద్‌ మణిపూర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. విద్యార్థులను పంపేందుకు సాయం చేస్తానని తెలిపారు.

ఉత్తరాఖండ్‌ కూడా..
ఇంఫాల్‌లోని సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో చదువుతున్న ఉత్తరాఖండ్‌కు చెందిన విద్యార్థులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి అధికారులను ఆదేశించారు.

ఏపీ వారు 150 మంది..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు మణిపూర్‌లో చిక్కుకున్నారు. సీఎం జగన్‌ రెండు ప్రత్యేక విమానాలను మణిపూర్‌కు పంపించి విద్యార్థులను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమానం ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరారు.

తెలంగాణ నుంచి 250 మంది..
మణిపూర్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిని స్వరాష్ట్రం తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆదివారమే కొంతమంది రాష్ట్రానికి రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో ఆలస్యం అయింది.

– హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ కౌశల్‌ తమ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఐఐఐటీ ఇంఫాలక్ష చదువుతున్నారని తెలపారు. వారిని సురక్షితంగా స్వరాష్ట్రం తీసుకువచ్చారు.

– మధ్యప్రదేశ్‌లోని 13 మంది మణిపూర్‌లో ఉన్నారు. వీరు రాజధాని నగరం ఇంఫాల్‌లోని క్యాంపస్‌లోని విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు.

విమాన చార్జీల పెంపు..
ఇదే అదనుగా ప్రైవేటు విమానాల చార్జీలను భారీగా పెంచాయి. కోల్‌కతాకు చెందిన ఒక బ్యాంకు అధికారి విమానం ఎక్కేందుకు ఇంఫాల్‌ విమానాశ్రయంలో వేలాది మంది వేచి ఉన్నారు. కానీ విమాన చార్జీలు ఆకాశాన్నంటాయి. కోల్‌కతా, గౌహతికి దాదాపు అన్ని విమానాలు నిండిపోయాయి. విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న భారీ ఛార్జీలను భరించలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular