
వీడెవడండి బాబూ.. ఏకంగా కరిచిన పామును చేత్తో పట్టుకొని ఆస్పత్రికొచ్చాడు. ఆ పామును విడిచిపెట్టకుండా వైద్యం చేయమని డాక్టర్లను కోరాడు. ఏపాము కరిచిందో చూపించి మరీ ఆ నివారణ మందులు ఇవ్వాలని కోరాడు. ఈ హఠాత్ పరిణామానానికి స్థానికులు, వైద్యులు హడలి చచ్చారు.
కాటేసీన తాచుపామును పట్టుకొని ఆస్పత్రికొచ్చిన యువకుడిని చూసి అందరూ షాక్ అయ్యారు. అతడికి ప్రాథమిక చికిత్స అందించి జిల్లా ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లా ఉప్పరహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.
కాడప్ప అనే వ్యక్తి తన పొలంలో వ్యవసాయం చేస్తుండగా ఓ తాచుపాము అతడి ఎడమ చేతిపై కాటేసింది. వెంటనే ఆ పామును చేతితో పట్టుకొని బంధువు సాయంతో స్థానిక ఆస్పత్రికి వచ్చాడు. అక్కడి వైద్యులు అతడికి ప్రాథమిక చికిత్స చేసి జిల్లా ఆస్పత్రికి పంపారు. జిల్లా ఆస్పత్రికి కూడా పామును పట్టుకొనే వెళ్లారు.
దీంతో బళ్లారి జిల్లా ఆస్పత్రి వద్ద ఆ పామును కొందరు కొట్టి చంపారు. ప్రస్తుతం కాడెప్ప ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి మానసిక పరిస్థితి బాగాలేదని స్థానికులు తెలిపారు.
వీడియో కోసం క్లిక్ చేయండి.