మరికొద్ది రోజుల్లో పశ్చిమబెంగాల్ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే అక్కడి రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. జంపింగ్‌లు నడుస్తూనే ఉన్నాయి. ఒకవిధంగా రాష్ట్రం మొత్తం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. బహిరంగ సభలు, సమావేశాలతో పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశాయి. ఇక్కడ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ.. ఇది పైకి కన్పించే అంశమే. అనేక పార్టీలు రంగంలోకి దిగుతుండటంతో మమత బెనర్జీ విజయానికి గండి పడుతుందేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
Also Read: మండుతున్న ధరలు..: మోడీపై ఫైర్ అవుతున్న నెటిజన్లు
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 293 అసెంబ్లీ స్థానాలున్నాయి. 150 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఈ ఎన్నికల్లో రావన్నది సుస్పష్టం. అంటే మమత బెనర్జీకి మెజారిటీ అయినా తగ్గాలి. బీజేపీకి గణనీయంగా సీట్ల సంఖ్య పెరగాలి. కానీ.. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇక్కడ 193 స్థానాల్లో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కాంగ్రెస్ మరికొన్ని చిన్నా చితకా పార్టీలను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశంలో ఉంది.
ఒకవేళ ఆ కూటమి మాత్రం బలపడితే అది మమత బెనర్జీకి కలిసొచ్చే అంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆ కూటమి చీల్చుకుంటే తమ గెలుపు సులువవుతుందని అనుకున్నారు. కానీ.. రోజురోజుకూ పరిస్థితి చూస్తుంటే చిన్న పార్టీలతోనే తమకు ముప్పు ఉన్నట్లు మమత బెనర్జీ గుర్తించారు. ఇప్పటికే 30 శాతం ఉన్న ముస్లిం ఓట్లు చీలిపోతాయన్న ఆందోళనలో మమత బెనర్జీ ఉన్నారు. ఎంఐఎం పార్టీతో పాటు ఇండియన్ సెక్యులర్ పార్టీలు తనను దెబ్బతీస్తాయన్న ఆందోళనలో మమత బెనర్జీ ఉన్నారు.
Also Read: నెమ్మదించిన కేసీఆర్.. నేడు పుట్టినరోజు
ఇక.. మరో 30 శాతం ఓట్లు ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓట్లపై కూడా రోజురోజుకూ మమత బెనర్జీకి నమ్మకం సన్నగిల్లుతోంది. ఇక్కడ జేఎంఎం, ఆర్జేడీ, జేడీయూ, ఎల్జేపీ, హిందూస్తానీ లెఫ్ట్ ఫ్రంట్, బీఎస్సీ, శివసేన, ఎస్సీ వంటి పార్టీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. కులాలు, సామాజిక వర్గాల వారీగా ఈ పార్టీలు ఓట్లు చీల్చుకుంటే మమత బెనర్జీకి ఇబ్బంది తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ పోటీ చేసినా ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. మరి ఈసారి ఏమాత్రం ప్రభావం చూపబోతున్నాయో చూడాలి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్