https://oktelugu.com/

కేంద్రంపై పోరుకే మమత సిద్ధం?

రాష్ర్టాలతో కూడిన దేశం అమెరికా. మన దేశం కూడా రాష్ర్టాలతో కూడిన సమూహమే. కానీ ఇక్కడ రాష్ర్టాలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. అవి కేంద్రంపై ఆధారపడాల్సిందే. దీంతో కేంద్రానికి రాష్ర్టాలకు మధ్య ఎడం పెరుగుతూనే ఉంది. అది ఇప్పటిది కాదు. గతంలో కూడా జరిగినవే. ప్రస్తుతం ఈ దూరం మరింత పెరిగిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ర్ట సంబంధాలపై అందరికి అంచనాలు పెరిగిపోయాయి. కేంద్రం ఆదుకుంటుందని భావంతో ఉన్నా సరైన న్యాయం జరగడం లేదని చెబుతున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2021 / 09:23 AM IST
    Follow us on

    రాష్ర్టాలతో కూడిన దేశం అమెరికా. మన దేశం కూడా రాష్ర్టాలతో కూడిన సమూహమే. కానీ ఇక్కడ రాష్ర్టాలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. అవి కేంద్రంపై ఆధారపడాల్సిందే. దీంతో కేంద్రానికి రాష్ర్టాలకు మధ్య ఎడం పెరుగుతూనే ఉంది. అది ఇప్పటిది కాదు. గతంలో కూడా జరిగినవే. ప్రస్తుతం ఈ దూరం మరింత పెరిగిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ర్ట సంబంధాలపై అందరికి అంచనాలు పెరిగిపోయాయి. కేంద్రం ఆదుకుంటుందని భావంతో ఉన్నా సరైన న్యాయం జరగడం లేదని చెబుతున్నారు.

    రాజ్యాంగం ప్రకారం ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్స్. అమెరికా లాగే మన రాష్ర్టాలకు ప్రత్యేక అధికారాలు, ప్రభుత్వాలున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం, రాష్ర్టాల మధ్య దూరం పెరిగిపోతోంది. కోవిడ్ వ్యాక్సినేషన్ సందర్భంలో బీజేపీయేతర రాష్ర్టాలపై శీతకన్ను వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వాగ్వాదాలు జరిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ర్టాల యూనియన్ ప్రతిపాదన చేస్తున్నట్లు సమాచారం.

    సమాఖ్య నిర్మాణంలో రాష్ర్ట ప్రభుత్వాల యూనియన్ ఉండాలి. ఏదైనా రాష్ర్టం వివక్షకు గురైతే ఇతర రాష్ర్టాలు దాని కోసం పోరాడాలి. ప్రతి ముఖ్యమంత్రి కలిసి ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాలి. కేంద్రం తీరును తప్పుపట్టడం, ధిక్కరించడం వంటి చర్యలు చేస్తే కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ర్టాల యూనియన్ పెట్టాలనే ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది.

    కేంద్రం వ్యవసాయరంగంలో సంస్కరణల పేరుతో తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనలకు బెంగాల్ సీఎం మమత బెనర్జీ మద్దతు ప్రకటించారు. రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చేలా ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంలోనే యూనియన్ ఆఫ్ స్టేట్స్ ప్రతిపాదన వచ్చిందని చెబుతున్నారు.