Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలోని భవానీపూర్ లో జరిగిన ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. ఆమె సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ పై జయభేరి మోగించారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించి 50 వేలకు పైగా మెజార్టీ సాధించి తనకు సాటిలేదని నిరూపించారు. దీంతో మమత తన సీఎం పీఠాన్ని పదిలం చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో పరాభవం చవిచూసిన మమత ప్రస్తుతం విజయం సాధించి పోయిన పరువును నిలబెట్టుకున్నారు.

గత మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థిపై ఓటమి పాలవడం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఆరు నెలల్లోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో భవానీపూర్ శాసనసభ్యుడు శోభన్ దేవ్ చటోపాధ్యాయ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికకు అవకాశం ఏర్పడింది. దీంతో ఆమె ఎన్నిక జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ కు విజయం దక్కింది.
ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీకి 84 వేల ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థిపై 58 వేల ఆధిక్యం లభించింది. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ కు 26 వేల ఓట్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఓటర్లకు రుణపడి ఉంటామని చెప్పారు. మూడో స్థానంలో ఉన్న శ్రీజీబ్ బిశ్వాస్ కు కేవలం రెండున్నర వేల ఓట్లే వచ్చాయి. దీంతో బెంగాల్ లో తృణమూల్ కు ఎదురేలేదని నిరూపించారు.
భవానీపూర్ తోపాటు శంషేర్ గంజ్, జాంగిపూర్ లోనూ తృణమూల్ అభ్యర్థుల విజయం పొందారు. జాంగిపూర్ తృణమూల్ అభ్యర్థి జాకీర్ హుస్సేన్ కు భారీ మెజార్టీ సాధించారు. పోలైన మొత్తం ఫోన్లలలో దాదాపు 68 శాతం ఓట్లు తృణమూల్ అభ్యర్థి హుస్సేన్ కు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి సుజిత్ దాస్ కు కేవలం 22 శాతం ఓట్లు వచ్చాయి. శంషేర్ గంజ్ లో టీఎంసీ అభ్యర్థి అమిరుల్ ఇస్లాంకు 50 శాతం ఓట్లు పోలయ్యాయి.