spot_img
Homeజాతీయ వార్తలుMamata Banerjee Defeat: మమత కళ్ళు మూసుకుంది.. బెంగాల్ కాలిపోయింది.. చివరికి ఆమె ఓడిపోయింది.. ఎన్ని...

Mamata Banerjee Defeat: మమత కళ్ళు మూసుకుంది.. బెంగాల్ కాలిపోయింది.. చివరికి ఆమె ఓడిపోయింది.. ఎన్ని కారణాలో..

Mamata Banerjee Defeat: కర్ణుడి చావుకు కారణాలు అనేకం.. తన మంచి కోసం ఎంతోమంది ఎన్నో చెప్పినప్పటికీ కర్ణుడు వినిపించుకోలేదు. పైగా దుష్ట సహవాసం చేశాడు. ఫలితంగా ఎంతో పేరు తెచ్చుకోవలసిన వీరుడు.. దారుణమైన చావు చస్తాడు. మహాభారతంలో కర్ణుడి పాత్ర చాలామందికి ఒక పాఠం లాంటిది. అందువల్లే మేధావులు ఏదైనా విషయం గురించి చెబుతున్నప్పుడు కర్ణుడి ఉదంతం గురించి వివరిస్తుంటారు.

ఆధునిక కాలంలో.. ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మమత బెనర్జీ రాజకీయ ముఖచిత్రం అచ్చం కర్ణుడి చావులాగే కనిపిస్తుంది. గతంలోనే ఆమె నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. ఆ సమయంలో ఆమె సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు.. ఆ తర్వాత మళ్లీ భవానిపూర్ నియోజకవర్గంలో ఆమె పోటీ చేశారు. విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.. ఇప్పుడు అదే భవానిపూర్ నియోజకవర్గం లో ఆమె ఓటమి పాలయ్యారు.. సువేందు చేతిలోనే ఈసారి కూడా పరాజయం పాలయ్యారు.

మమత ఓడిపోవడానికి అనేక కారణాలను రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మమత తనలో ఉన్న అసలు సిసలైన ఫ్యూడల్ భావజాలాన్ని బయట పెట్టుకున్నారు.. ముఖ్యంగా టిఎంసి కార్యకర్తలను గుండాల కంటే ఎక్కువగా పెంచి పోషించారు. వారు జనాల మీద పడి దారుణాలకు పాల్పడేవారు. ఆర్ జి కార్, సందేశ్ ఖాళీ లాంటి ఘటనలు మమత పరిపాలనకు ఒక మెచ్చు తునకలు. ఇటువంటి ఘటనలు కొన్ని మాత్రమే బయటపడ్డాయి. బయటపడనివి చాలా ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాష్ట్రంలోనికి రానివ్వకపోవడం.. శాంతిభద్రతలు దారుణంగా మారిపోవడం.. బంగ్లాదేశ్ ప్రజలకు ఇక్కడి పౌరసత్వం కల్పించడం వంటి దారుణాలకు మమత పాల్పడ్డారు. మమత మేనల్లుడు షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. బెంగాల్ రాష్ట్రాన్ని తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నాడు. ఒకప్పుడు భారతదేశానికి కర్మాగారంగా వెలుగొందిన బెంగాల్ రాష్ట్రం.. అశాంతికి.. అసమర్థతకు నిదర్శనంగా మారింది. చెప్పుకునే స్థాయిలో ఒక కర్మగారం కూడా అక్కడ లేకుండా పోయింది. దీంతో బెంగాల్ రాష్ట్రం బీమారి రాష్ట్రంగా మారిపోయింది.

కమ్యూనిస్టుల పరిపాలన కాలంలో సర్వనాశనమైన బెంగాల్.. మమత పరిపాలన కాలంలో పూర్తిగా అడుగు పట్టింది. ఇవన్నీ కారణాలు బెంగాల్ ప్రజలను ఈసారి పూర్తిగా ఆలోచింపజేశాయి. అందువల్లే మమతను బెంగాల్ ప్రజలు ఓడించారు. ఆమె ప్రభుత్వాన్ని అధికారానికి దూరంగా ఉంచారు. తన పరిపాలన కాలంలో మమతా బెనర్జీ పూర్తిగా కళ్ళు మూసుకున్నారు. కొంతమంది వ్యక్తుల చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయారు. వ్యవస్థలు మొత్తం నాశనమవుతున్నా ఆమె చూస్తూ ఉండిపోయారు. ఫలితంగా బెంగాల్ కాలిపోయింది. బెంగాల్ ఒకప్పటిలాగా పూర్వస్థితిని అందుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందువల్లే ఈసారి బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారు. మమతను ఇంటి వద్ద ఉండి రెస్ట్ తీసుకోవాలని.. ఓటు రూపంలో తమ ఆగ్రహాన్ని చూపించారు. ఇన్ని పరిణామాల తర్వాత మమత మారుతుందా.. మారితే మనిషి అవుతుంది. లేకుంటే బెంగాల్ ప్రజలు చెబుతున్నట్టుగానే తాటకిలాగా కనిపిస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper
Exit mobile version