Homeఆంధ్రప్రదేశ్‌Mallikarjun Kharge: ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే? కాంగ్రెస్, బిజెపిలకు షాక్

Mallikarjun Kharge: ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే? కాంగ్రెస్, బిజెపిలకు షాక్

Mallikarjun Kharge: ఇండియా కూటమి దళిత ప్రధాని కార్డు ఉపయోగించనుందా? బిజెపి హవాను ఢీ కొట్టాలంటే అదే సరైన నిర్ణయంగా భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో సమావేశం అయ్యాయి. భవిష్యత్ కార్యాచరణ పై చర్చించాయి. దేశవ్యాప్తంగా మరో 10 కూటమి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఎట్టి పరిస్థితుల్లో బిజెపిని గద్దె దించాలని బలమైన నిర్ణయానికి వచ్చాయి.

ఉత్తరాది రాష్ట్రాల్లో ఇండియా కూటమి బలపడుతూనే… దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి ఎంట్రీని అడ్డుకోవాలని ఇండియా కూటమి పార్టీలు భావిస్తున్నాయి. అందుకే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన దళిత నేతను కూటమి ప్రధానిగా ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానంగా వినిపిస్తోంది. ఢిల్లీ సమావేశంలో సైతం త్రుణముల్ అధినేత్రి మమతా బెనర్జీ ఖర్గే పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే దీనిని ఖర్గే వారించినట్లు తెలుస్తోంది. ముందుగా కూటమిని అధికారంలోకి తీసుకొద్దామని.. తరువాత ప్రధానిని ఎంపిక చేసుకుందామని ఖర్గే చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రధాని మోదీ బీసీ మంత్రం పఠిస్తున్న సంగతి తెలిసిందే. దానికి చెప్పాలంటే దళిత ప్రధాని నినాదం బలంగా తీసుకెళ్లాలని ఇండియా కూటమి పక్షాలు భావిస్తున్నాయి. మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక కు చెందిన దళిత నాయకుడు. ప్రస్తుతం జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పేరును ప్రతిపాదించడం ద్వారా కాంగ్రెస్ అగ్రనాయకత్వం తో పాటు బిజెపికి షాక్ ఇవ్వాలని ఇండియా పక్షాలు భావిస్తున్నట్లు ఉన్నాయి. అయితే ఖర్గే పేరు ప్రతిపాదిస్తున్నట్లు ఇండియా భాగస్వామి పక్షాలే మీడియాకు లీకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేశ ప్రజలకు ఒక రకమైన సంకేతాలు పంపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఉత్తరాధి వారే భారత ప్రధాని పదవి చేపడుతున్నారు అన్న విమర్శ ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని ఎప్పటినుంచో ఆరోపణ ఉంది. ఈ దేశానికి 14 మంది ప్రధాన మంత్రుల్లో.. దక్షిణ రాష్ట్రాలకు చెందిన ఇద్దరికీ మాత్రమే అవకాశం దక్కింది. పీవీ నరసింహారావు, దేవ గౌడ మాత్రమే ప్రధానులుగా వ్యవహరించారు. 1997 ఏప్రిల్ 21న దేవగౌడ పదవి నుంచి దిగిపోయారు. అప్పటినుంచి దక్షిణాది రాష్ట్రాలకు చాన్స్ రాలేదు. అందుకే ఈసారి మల్లికార్జున్ ఖర్గేకు అవకాశం ఇచ్చి దక్షిణాది రాష్ట్రాల్లో స్వీప్ చేయాలని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఆలోచన చేస్తున్నాయి. ఇంతవరకు ఈ దేశానికి దళిత ప్రధాని లేరు. ఖర్గేను ప్రధాని చేస్తే ఇండియాకు తొలి ప్రధానిగా భావించాల్సి ఉంటుంది. అది బిజెపి పట్టణానికి కారణం అవుతుందని ఇండియా కూటమి పక్షాలు బలంగా ఆశిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version