https://oktelugu.com/

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ వరస్ట్ బిహేవియర్ బయటపెట్టిన మాజీ కంటెస్టెంట్… వైరల్ గా సోషల్ మీడియా పోస్ట్

విన్నర్ అయ్యాక చాలా ఓవర్ చేస్తున్నాడు. రూడ్ గా ప్రవర్తిస్తున్నాడని నెట్టింట్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూ కావాలంటే .. తన పొలంలో పని చేయాలి అంటూ కామెంట్స్ చేయడం పై విమర్శలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు ఎంతో మంచివాడిగా ప్రవర్తించిన ప్రశాంత్ .

Written By: , Updated On : December 20, 2023 / 10:07 AM IST
Pallavi-Prashanth-real
Follow us on

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 లో రైతు బిడ్డగా హౌస్ లోకి వెళ్లి .. విజేతగా నిలిచి హాట్ టాపిక్ గా మారాడు పల్లవి ప్రశాంత్. అయితే అతని ఫ్యాన్స్ గెలిచిన సంతోషం లేకుండా చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు భారీగా చేరుకొని కంటెస్టెంట్ల కార్లు, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. పోలీసులు ప్రశాంత్ పై, అతని ఫ్యాన్స్ పై పలు రకాల కేసులు నమోదు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా .. బిగ్ బాస్ హౌస్ లో ఎంతో మంచి పేరు సంపాదించిన ప్రశాంత్ ఇప్పుడు కాంట్రవర్సీకి గురవుతున్నాడు.

అతను విన్నర్ అయ్యాక చాలా ఓవర్ చేస్తున్నాడు. రూడ్ గా ప్రవర్తిస్తున్నాడని నెట్టింట్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూ కావాలంటే .. తన పొలంలో పని చేయాలి అంటూ కామెంట్స్ చేయడం పై విమర్శలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు ఎంతో మంచివాడిగా ప్రవర్తించిన ప్రశాంత్ .. బయటకు వచ్చాక తన అసలు రంగు బయటపెట్టాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈవెంట్ ముగిసిన తర్వాత పలువురు యూట్యూబర్స్ ప్రశాంత్ దగ్గరకు వెళ్లి ఇంటర్వ్యూ అడిగారు.

దీంతో ప్రశాంత్ మీరేమైనా ఒక్క రైతుకైనా హెల్ప్ చేశారా .. నేను ఎందుకు ఇవ్వాలి .. నా పొలం లోకి పోదాం .. నా పొలంలో ఒక్క రోజైన పని చేశారా అంటూ కామెంట్స్ చేశాడు. ఒక యూట్యూబ్ ఛానెల్ రైతులకు ఏం ఇస్తుంది .. అంటూ వారితో కటువుగా ప్రవర్తించాడు. ఇక ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రశాంత్ ప్రవర్తనకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ శివ ప్రశాంత్ తీరుపై ఫైర్ అయ్యాడు. తనను గంటల తరబడి వెయిట్ చేయించి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా పర్లేదు, ఆ చెప్పిన విధానం బాగోలేదు. వరస్ట్ బిహేవియర్ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇచ్చాడు ప్రశాంత్. టైటిల్ విన్నర్ అయ్యాక ఫోజ్ కొడుతున్నాడు. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ప్రశాంత్ పై మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చకి పోలీసులు కేసులు పెట్టారు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతడు పరారీలో ఉన్నట్లు సమాచారం..