ప్రియాంకగాంధీ చొక్కా పట్టిన మగ పోలీసు.. యూపీలో ఏంటీ దారుణం?

ఉత్తరప్రదేశ్ లోని హత్రాజ్ జిల్లాలో హత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. యూపీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అయితే కడిగిపారేశారు.. ఓ పోలీస్ ఏకంగా ప్రియాంకగాంధీ కుర్తాను పట్టుకొని లాగడంపై విమర్శలు గుప్పించారు. ‘యోగిజీ మీ పాలనలో అసలు మహిళా పోలీసులే లేరా?’ అని రౌత్ నిలదీశారు. Also Read: రాముడి కోసం, దేశం కోసం ఆ […]

Written By: NARESH, Updated On : October 4, 2020 10:49 am
Follow us on


ఉత్తరప్రదేశ్ లోని హత్రాజ్ జిల్లాలో హత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. యూపీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అయితే కడిగిపారేశారు.. ఓ పోలీస్ ఏకంగా ప్రియాంకగాంధీ కుర్తాను పట్టుకొని లాగడంపై విమర్శలు గుప్పించారు. ‘యోగిజీ మీ పాలనలో అసలు మహిళా పోలీసులే లేరా?’ అని రౌత్ నిలదీశారు.

Also Read: రాముడి కోసం, దేశం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా?

మహిళ అని కూడా చూడకుండా ప్రియాంక గాంధీ చొక్కాను పోలీసులు పట్టుకోవడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఒక చిత్రం దేశవ్యాప్తంగా యూపీ సీఎం పరువు తీసింది.. ఒక మహిళా నాయకురాలిని జాతీయ సెలెబ్రెటీ అని కూడా చూడకుండా ఆమె దుస్తులు పట్టుకోవడం ద్వారా  ఆ పోలీసు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లోనూ దీనిపై తీవ్ర కోపం, ఆవేదన  వ్యక్తం అవుతోంది. జాతీయ నాయకురాలికే ఇలా జరిగితే.. ఇక సామాన్యుల పరిస్థితి యూపీ పోలీసుల చేతుల్లో ఎలా ఉంటుందని..  యుపి రాష్ట్రంలో ఒక సాధారణ మహిళకు ఎలా న్యాయం జరుగుతుందని మహిళా లోకం నినదిస్తోంది. యుపి పోలీసుల చర్యలు ప్రతిరోజూ విపరీతంగా అనాగరికంగా మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు..  ఇతర మద్దతుదారులతో కలిసి హత్రాస్ లోని హత్యాచార బాధితురాలి వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఓ మగ పోలీసు దారుణంగా ప్రవర్తించారు. ప్రియాంక గాంధీ చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలను  పోలీసుల లాఠీల దెబ్బల నుంచి కాపాడటానికి ముందుండి సాగారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ పోలీస్ ప్రియాంక చొక్కా పట్టుకున్నాడు. ఇక నిన్న రాహుల్ గాంధీని ఎలా కిందకు నెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారో చూశాం.

Also Read: కరోనా నుంచి కోలుకొనే పరిస్థితి లేదా?

ప్రియాంక గాంధీ పర్యటన ఆద్యంతం ఉద్రిక్తతకు దారితీసింది.  ఆమె బాధితురాలి కుటుంబాన్ని చేరి పరామర్శించారు. ఆమె పర్యటనలో మూడు అద్భుతమైన ఫొటోలు  వైరల్ అయ్యాయి. ప్రియాంక చొక్కానుపట్టుకున్న పోలీసు ఫొటోతోపాటు.. ఒకే లాఠీ ఛార్జ్‌లో ముందుండి ప్రియాంక నెట్టిన ఫొటో.. మరొకటి హత్యాచార  బాధితురాలి తల్లిని కౌగిలించుకున్న ఫొటో అందరినీ కలిచివేసింది. రాహుల్, ప్రియాంక గాంధీలు బాధితురాలి తల్లిని ఓదార్చారు  వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు.