Maharashtra: వర్షాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాధించేందుకు మహారాష్ట్రకు వెళ్లిన వందలాది మంది పర్యాటకులకు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ట్రెక్కింగ్ కోసం ఓ కొండపైకి వెళ్తుండగా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో పర్యాటకులు రెయిలింగ్ పట్టుకుని ప్రాణాలు కాడుకున్నారు. తర్వాత సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని రోప్ సహాయంతో వారిని క్షేమంగా కిందకు తీసుకొచ్చారు.
వర్షాకాలంలో పచ్చని స్వర్గధామంలా…
వైవిధ్య భరితమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన మహారాష్ట్ర వర్షాకాలంలో పచ్చని స్వర్గధామంలా మారుతుంది. వర్షాలతో కొండలు, లోయలకు జీవం వస్తుంది. ట్రెక్కింగ్ చేసేవారిని ఆకర్షిస్తాయి. పొగమంచు పర్వతాలు, జలపాతాలు, పచ్చని పరిసరాలు అసమానమైన ట్రెక్కింగ్ అనుభూతిని అందిస్తాయి. అందుకే దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు ఎక్కువగా జూన్, జూలై మాసాల్లో మహారాష్ట్రకు వస్తుంటారు.
రాయిగఢ్ కోట వద్ద…
ఇలా రాయిగఢ్ కోటకు వెళ్లేందుకు వందలాది మంది టూరిస్టులు మహారాష్ట్రకు వస్తున్నారు. 1,400 మీటర్ల ఎత్తయిన రాయిగఢ్ కోటకు కూడా భారీగా పర్యాటకులు వస్తున్నారు. అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మహారాష్ట్రలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో సందర్శకులు రాయిగఢ్ కోట ఎక్కుతుండగా, ఎక్కినవారు ట్రెక్కింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కొండపై నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చింది. దీంతో కొండపైకి వెళ్తున్న వందల మంది టూరిస్టులు ఇబ్బంది పడ్డారు. ప్రాణాలు కాపాడుకునేందుకు రెయిలింగ్ పట్టుకున్నారు.
హుటాహుటిన సహాయక చర్యలు..
సమాచారం అందుకున్న మహారాష్ట్రలోని రెస్క్యూ సిబ్బంది వెంటనే రాయిగఢ్ కోట వద్దకు చేరుకున్నారు. రోప్ సహాయంతో వరదలో చిక్కుకున్న పర్యాటకులను కిందకు తీసుకొచ్చారు. వారిని సహాయక శిబిరాలకు తరలించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో జూలై 31 వరకు రాయిగఢ్ కోట మార్గం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
A horrific video from Raigad fort wherein more than 30 people were stranded…heavy rainfall causes intense water stream. Rescue ops ensure people are saved …no casualties as yet#MumbaiRains pic.twitter.com/E2MPSu4xJ7
— Gaurav Srivastav (@gauravnewsman) July 8, 2024