Maharashtra Political Crisis: మహారాష్ట్రలో మూడు రోజులుగా సంక్షోభం కొనసాగుతోంది. రాజకీయ అపరివక్వత, అధికార ఆకాంక్ష అధికార శివసేనలో చిచ్చు రాజేసింది. బాల్‌థాక్రే ఉన్నప్పుడు శివసైనికులు క్రమశిక్షణతో సాగేవారు. బాల్‌థాక్రే సారథ్యంలో పార్టీ ఒక పంథాలో పనిచేసేది. ఆయన మరణం తర్వాత పార్టీ మొదటిసారి శివసేన చీలిపోయింది. ఆయన తనయులు రాజ్‌థాక్రే, బాల్‌థాక్రేలు వర్గాలుగా విడిపోయారు. ఉద్దవ్ థాక్రే శివసేను ఓన్ చేసుకున్నారు. రాజ్‌థాక్రే తండ్రి ఆశయం మేరకు కొత్త పార్టీ స్థాపించారు. శివసేన సారథ్య బాధ్యతలు చేపట్టిన ఉద్దవ్ థాక్రే కేవలం అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేశారు. పార్టీలోని లోటుపాట్లను పెద్దగా పట్టించుకోలేదు.

మరోవైపు రాజకీయంగా రాణించాలని మొదటి నుంచి ఆకాంక్ష ఉన్న ఉద్దవ్ థాక్రే భార్య ఆయనకు అండగా నిలిచింది. అయితే ఇక్కడ ఉద్దవ్ థాక్రే రాజకీయ అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిణామాలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఉద్దవ్ థాక్రే భార్య సంజయ్‌రావుత్‌తో శివసేనలో రాజకీయం ప్రారంభించారు. గ్రౌండ్ లెవల్‌ను పూర్తిగా విస్మరించారు. 2017లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ వల్లనే శివసేనకు ఆ మాత్రం సీట్లు వచ్చాయి. తక్కువ సీట్లు వచ్చినా బీజేపీపై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవి ఈసారి తమకే ఇవ్వాలని శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే మొండికేశాడు. దీనివెనుక అతడి భార్య ఉందని అప్పుడే వార్తలు వచ్చాయి. చిరకాల మిత్రుడు అయిన శివసేనను దూరం చేసుకోకూడదని భావించిన బీజేపీ ఇక్కడ ఒక ప్రతిపాదన తెచ్చింది. దాన్ని తిరస్కరించడంతో వీరి పొత్తు చెడిపోయింది.
Also Read: BJP Venkaiah Naidu: వెంకయ్య కాకపోయే.. ఆ మీడియా, ఆ సామాజికవర్గం గగ్గోలు
-చెరోసగం సీట్లలో పోటీ..
288 అసెంబ్లీ సీట్లు ఉన్న మహారాష్ట్రలో శివసేన, బీజేపీ పొత్తులో భాగంగా చెరిసగం సీట్ల చొప్పున 144 స్థానాలు పంచుకున్నారు. ఇక్కడ పొత్తుతో బీజేపీకి లబ్ధి జరగలేదు. శివసేన మాత్రం బలపడింది. అయితే ఎన్నికలకు ముందే ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీనే ముఖ్యమంత్రి పదవి అధిష్టించాలని ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన ఆకాంక్ష నెరవేరే అవకాశం కనిపించలేదు. శివసేన కేవలం 55 స్థానాల్లో గెలవగా, బీజేపీ 101 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఒప్పందం ప్రకారం సీఎం బీజేపీ అభ్యర్థి కావాలి.

-అధికార కాంక్షతో మిత్రుడికి దూరం..
అయితే ఉద్దవ్ థాక్రే భార్య ఇక్కడ రంగంలోకి దిగారు. సంజయ్‌రౌత్ సహకారంతో అధికారం చేజిక్కించుకునేందుకు వ్యూహ రచన చేశారు. ఈ మేరకు మిత్రుడు బీజేపీని దూరం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ శివసేనకు స్నేహహస్తం అందించింది. ఎన్‌సీపీ కూడా మద్దతుకు ముందుకు వచ్చింది. దీంతో సంజయ్‌రౌత్ సహకారంతో మహా వికాస్ అఘాడీ కూటమి ఆవిర్భవించి శివసేన నేతృత్వంలో సర్కార్ ఏర్పాటు చేసింది.
-వరుస పరిణామాలనూ లెక్క చేయక..
అయితే.. అధికారంలో ఉన్నా… క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను ఉద్ధవ్ అంచనా వేయలేకపోయారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార శివసేన కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. అయిన పట్టించుకోలేదు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతుంది. కానీ మహారాష్ట్రలో అలా జరుగలేదు. ఇక రాజ్యసభ ఎన్నికల్లోనూ అధికార కూటమికి షాక్ తగిలింది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిని నిలిపిన బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించింది. అయినా ఉద్ధవ్, సంజయ్‌రౌత్ పెద్దగా లెక్క చేయలేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. బలం ఉన్నా ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. వరుస పరిణామాలతో మేల్కోలేకపోయిన ఉద్ధవ్ తీరుతో పార్టీలో చీలికకు దారితీసింది. అధికారానికి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది.
[…] Also Read: Maharashtra Political Crisis: రాజకీయ అపరిపక్వత.. చీలిపోయ… […]