Maharashtra CM: ఇప్పుడు దేశం యావత్తు చూపు ముంబై రాజధానిగా ఉన్న మహారాష్ట్ర వైపునకే ఉంది. ఒక్క దేశమే కాదు ప్రపంచం మొత్తం అన్నా తప్పులేదు. ఎందుకంటే దేశ ఆర్థిక రాజధాని ముంబై కాబట్టి. ఇటీవల అక్కడ అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. 288 మంది సీట్లకు నిర్వహించిన ఎన్నికల్లో ‘మహాయుతి’ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మహాయుతిలో కూటమిగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) 41 స్థానాలను దక్కించుకొని దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేయాలని మద్దతిస్తుంది. ఆదివారం (నవంబర్ 24) ముంబైలో జరిగిన సమావేశంలో ఎన్ సీపీ తన అభిప్రాయం వెలువరిచింది. ఇక ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన సీఎం కుర్చీని మళ్లీ షిండేకే అప్పగించాలని డిమాండ్ చేసింది, ఆయన ప్రతిష్టాత్మక పథకం సీఎం మాఝీ లడ్కీ బాహిన్ యోజన ద్వారానే ఎన్నికల్లో మహాయుతి భారీ మెజార్టీతో గెలిచిందని షిండే వర్గం చెప్తోంది. అంతకు ముందు షిండే కూడా తమ సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రజలు తమ ఓట్లతో స్పందించారని చెప్పారు. 132 స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ను తదుపరి ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటుంది.
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఫార్ములా సిద్ధంగా ఉందని, బీజేపీకి దాదాపు 24 మంది మంత్రులు ఉంటారని, ఏక్‌నాథ్ షిండే శివసేనకు 12 మంది ఉంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మహారాష్ట్రలోని కొత్త ప్రభుత్వంలో ఎన్సీపీకి 10 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల ఫార్ములా కొనసాగుతుందని అంటున్నారు.
తదుపరి చర్యల కోసం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. కొన్ని పార్టీలు మాత్రం నేతలు ఢిల్లీకి వెళ్లడం లేదని తేల్చిచెప్పాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహా కూటమి, ఆరు ప్రధాన పార్టీలుగా ఉన్న ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు 19 స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో నిలిచారు.
శివసేన శాసనసభాపక్ష నేతగా షిండే ఎన్నికయ్యారు. ఈ మేరకు శివసేన నేతలు ఆదివారం సాయంత్రం తీర్మానం చేశారు. షిండే అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో శివసేన నేత ఉదయ్ సామంత్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మంత్రివర్గం, ప్రమాణ స్వీకార ప్రక్రియపై నిర్ణయం తీసుకునే అన్ని అధికారాలను ఏక్ నాథ్ షిండేకు ఇవ్వాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు సమావేశం అనంతరం శివసేన నేత ఉదయ్ సామంత్ మీడియాకు స్పష్టం చేశారు.
దీనిపై శివసేన అభ్యర్థి సంజయ్ షిర్సత్ స్పందిస్తూ.. ‘మహాయుతి నేతలు సోమవారం ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. ప్రతీ కార్యకర్త తమ పార్టీ నాయకుడు చీఫ్ కావాలని కోరుకుంటున్నారని, అయితే, తుది నిర్ణయం షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ దేనని అన్నారు. షిండే వర్గం శివసేన సిట్టింగ్ ఎంపీ రాహుల్ షెవాలే కూడా షిండేను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ధృవీకరించారు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Maharashtra government formation live updates who will be the next chief minister
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com