Maharashtra Election results 2024 :మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. మరోవైపు జార్ఖండ్ లో ఇండియా కూటమిl సత్తా చాటుతోంది. అయితే ఈ క్రమంలో మరోసారి తెలుగు సర్వే సంస్థ పేరు మార్మోగుతోంది. ఆ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా ఉన్నాయి. మహారాష్ట్రలో మహా యూటీ కూటమిదే అధికారమని కేకే సర్వే తేల్చింది.అయితే ఈ సంస్థ ఇచ్చిన సర్వేకు దగ్గరగా ఉంది కూటమి ఆధిక్యం. మహారాష్ట్రలో ఆ కూటమికి 225 స్థానాలు వస్తాయని సదరు సర్వే సంస్థ అంచనా వేసింది. ఊహించినట్టే కూటమి అన్ని స్థానాల్లోనే లీడ్ లో ఉంది. మొన్నటి హర్యానా ఎన్నికల్లో ఈ సంస్థ అంచనాలు తప్పాయి. అప్పటినుంచి ఒక రకమైన విమర్శలు మొదలయ్యాయి.గాలి లెక్కలు చెబుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.అయితే ఈ విమర్శలతో కేకే కృంగిపోలేదు. మహారాష్ట్రలో సరైన అంచనాలతో ముందుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.అయితే సర్వే సంస్థలు ఇవ్వని విధంగా.. మహారాష్ట్రలో 225 స్థానాల్లో మహా యూటీ ఓటమి గెలుస్తుందని కేకే తన సర్వే ఫలితాలను ప్రకటించింది.ఈరోజు ఉదయం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. అవే స్థానాల్లో కూటమి ఆధిక్యం కనబరచడం విశేషం.
* ఏపీలో చాలా దగ్గరగా
ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో కేకే తన సత్తా చాటింది. ఏపీలో ఎగ్జాక్ట్ ఫలితాలను ప్రకటించింది. 160 కి పైగా స్థానాల్లో టిడిపి కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించింది. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ దగ్గర గెలుపు అని తేల్చి చెప్పింది. కేకే అంచనాలకు తగిన విధంగా ఏపీ ఫలితాలు రావడంతో ఆ సంస్థ పేరు మార్మోగిపోయింది. తాజాగా మహారాష్ట్ర ఫలితాల్లో కూడా కేకే సర్వే దగ్గర కావడంతో జాతీయస్థాయిలో ఆయన సర్వే మరోసారి సంచలనంగా మారింది.
* మిగతా వాటికి భిన్నంగా
వాస్తవానికి మహారాష్ట్రలో మహాయూటీ కమిటీకి 180 నుంచి 190 స్థానాలు మాత్రమే వస్తాయని మెజారిటీ సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ కేకే సర్వే మాత్రం 225 స్థానాల్లో గెలుపు తప్పదని తేల్చి చెప్పింది. తన సర్వే అక్షరాల నిజం అవుతుందని కూడా కేకే స్పష్టం చేశారు. అయితే ఆయన చెప్పిన మాదిరిగానే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అక్కడ ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో కేకే సర్వే జాతీయ స్థాయిలో మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.