Maha Kumbh Mela : ఇక ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ ఘటనలోనూ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో నిర్వహిస్తున్న మహా కుంభమేళాలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలోనూ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో ఏదైనా వేడుకలు.. ఇతర సందర్భాలలో తొక్కిసలాటలు చోటు చేసుకోవడం కొత్త కాదు. ఆ ఘటనలు జరిగినప్పుడు ప్రమాద తీవ్రత అధికంగా ఉంటున్నది. ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉంటున్నది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కొంతమంది అధికారులను ప్రభుత్వాలు సస్పెండ్ చేయడం.. చనిపోయిన వారికి పరిహారం ఇవ్వడం.. గాయపడిన వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించడంతోనే సరిపోతోంది. వాస్తవానికి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం సాధ్యం కాదా? ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది కదా? ఇప్పుడు వీటిపై రూపొందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇలా కాపాడుకోవచ్చు
జాతరలు, ఏదైనా వేడుకలు జరిగినప్పుడు ప్రజలు భారీగా వస్తుంటారు. ఆ సమయంలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన తొక్కిసలాటకు దారితీస్తుంది. ఫలితంగా ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం మహా కుంభమేళాలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 30 మంది వరకు చనిపోయారని తెలుస్తోంది. అయితే తొక్కిసలాట వంటి ఘటనలు జరిగినప్పుడు కాపాడుకోవడానికి ఎలాంటి విధానాలు అవలంబించాలో సోషల్ మీడియాలో కొంతమంది ఓ వీడియోలో చూపించారు. ప్రజలు సరైన విధానంలో నిలబడినప్పుడు వెనుక నుంచి ఒక్కరు తోసివేసినా.. ముందున్నవారు కింద పడిపోతారు. అలాంటప్పుడు బాక్సింగ్ ప్రదేశంలో నిలబడి ఉంటే బాగుంటుంది. అప్పటికి కూడా వెనకనుంచి ఎవరైనా తోసివేస్తే.. కిందపడి ముడుచుకొని పడుకోవాలి. అప్పుడు ఎటువంటి ప్రమాదం జరగదు. అలాకాకుండా ఎవరైనా తోసివేస్తే వెంటనే కింద పడితే ప్రమాదం తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పడితే ఊపిరి ఆడే అవకాశం కూడా ఉండదు. అప్పుడు త్వరగా ప్రాణం పోతుంది. ఇక గాయపడ్డ వారి పరిస్థితి కూడా అధ్వానంగానే ఉంటుంది. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి కుమారుడు పరిస్థితి కూడా ప్రస్తుతం అలానే ఉంది. ఇప్పటికీ అతడు కోలుకోలేదు.. ఇప్పట్లో కోలుకుంటాడనే నమ్మకం కూడా లేదు. తిరుపతి గతంలో కూడా గాయపడ్డవారు ఇంకా డిశ్చార్జ్ కాలేదు. ఇక ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారు కూడా ఇంతవరకు రికవరీ కాలేదు.. వారంతా కూడా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అయితే తొక్కిసలాట జరిగినప్పుడు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో రూపొందించిన వీడియో మాత్రం విశేషమైన ఆదరణ పొందుతోంది. ఇప్పటికే వేలాది వీక్షణలను సొంతం చేసుకుంది.
మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇలా కాపాడుకోవాలని కొంతమంది వీడియోలో చూపించారు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.#MahaKumbhMela2025 #PrayagrajMahakumbh2025 pic.twitter.com/EEPddK0y6z
— Anabothula Bhaskar (@AnabothulaB) January 29, 2025