https://oktelugu.com/

టీడీపీకి మరో కోలుకోలేని షాక్‌

సాధారణంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపై వరుసగా కోర్టులకు ఎక్కుతూ జగన్ సర్కార్ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది టీడీపీ. చంద్రబాబు నుంచి మొదలుపెడితే ఆ పార్టీ నాయకులంతా జగన్ సర్కార్ ఏం నిర్ణయం తీసుకున్నా హైకోర్టుకు ఎక్కుతూ నిర్ణయాలను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే కాలం అన్ని వేళలా ఒకేలా ఉండదు. అప్పుడప్పుడూ టీడీపీకి షాక్ తగిలేలా ఉంటుంది. Also Read: కేశినేనిపై అసమ్మతి.. ఆయన కూతురే టార్గెట్..! తాజాగా కొల్లు రవీంద్ర బెయిల్ పిటీషన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 2, 2020 10:36 am
    Follow us on


    సాధారణంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపై వరుసగా కోర్టులకు ఎక్కుతూ జగన్ సర్కార్ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది టీడీపీ. చంద్రబాబు నుంచి మొదలుపెడితే ఆ పార్టీ నాయకులంతా జగన్ సర్కార్ ఏం నిర్ణయం తీసుకున్నా హైకోర్టుకు ఎక్కుతూ నిర్ణయాలను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే కాలం అన్ని వేళలా ఒకేలా ఉండదు. అప్పుడప్పుడూ టీడీపీకి షాక్ తగిలేలా ఉంటుంది.

    Also Read: కేశినేనిపై అసమ్మతి.. ఆయన కూతురే టార్గెట్..!

    తాజాగా కొల్లు రవీంద్ర బెయిల్ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. అచ్చెన్న, జేసీ, కొల్లులు అరెస్ట్ అయినప్పటి నుంచి బెయిల్ పీటషన్లను టీడీపీ నేతలు వేస్తూనే ఉన్నారు. కానీ కోర్టుల్లో మాత్రం వీరికి ఊరట దక్కడం లేదు. బెయిల్ దొరకడం లేదు. హత్య కేసు విచారణలో ఉందని.. ఇలాంటి సమయంలో కొల్లు రవీంధ్రకు బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రొసిక్యూషన్ వాదనకు కోర్టు అంగీకరించి కొల్లు రవీంద్ర బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది.

    మచిలీపట్నం వైయస్ఆర్సిపి నాయకుడు మోకా భాస్కర్ రావు హత్య కేసులలో ఏ4గా ఉన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర . ఈయన బెయిల్ పిటిషన్ ను కోర్టు రద్దు చేయడంతో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

    కొద్ది రోజుల క్రితం ఇఎస్‌ఐ కుంభకోణాల కేసులో అరెస్టయిన టిడిపి సీనియర్, మాజీ మంత్రి అచెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు వేసిన బెయిల్ పిటీషన్లను కోర్టులు కొట్టివేస్తున్నాయి.

    Also Read: అయ్యో పాపం చంద్రబాబు నాయుడు

    ఈ ముగ్గురు టీడీపీ నాయకుల నుంచి జైలు నుంచి విడుదల చేయాలని టీడీపీ శిబిరం అంతా బెయిల్స్ మీద బెయిల్స్ కోసం పిటీషన్లు వేస్తూనే ఉన్నాయి. కానీ కోర్టుల్లో చుక్కెదురు అవుతోంది. టిడిపి నాయకుల బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తుండడంతో పార్టీ అధినేత చంద్రబాబులో అసహనం పెరిగిపోతున్నట్టు కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కోర్టుల ద్వారా ఎంతో చాకచక్యంగా మేనేజ్ చేసే పేరున్న చంద్రబాబుకు ఈ పరిణామాలు మింగుడు పడడం లేదని అంటున్నారు. తెలుగు దేశమ్ పార్టీ తప్పులే ఈ పరిస్థితికి కారణమని ఆడిపోసుకుంటున్నారు.