పకడ్బందీగా ప్లాన్డ్ గా ఏపీలో జరుగుతున్న హిందుత్వ దాడులపై ఏపీ సర్కార్ సీరియస్ గా దృష్టి సారించింది. ఓ వైపు బీజేపీ, మరో వైపు హిందూ సంఘాలు.. వాటికి తోడు టీడీపీ చేస్తున్న ప్రచారంతో దేశవ్యాప్తంగా జగన్ సర్కార్ అభాసుపాలవుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లిరాగానే జగన్ సీరియస్ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: ఏపీకొచ్చి మరీ జగన్ కు నిర్మల వార్నింగ్ ఇచ్చిందా?
మతాల మధ్య చిచ్చుపెడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొంత మంది సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ ద్వారా జగన్ ప్రకటన విడుదల చేయించారు. అలాంటి చర్యలను ఉపేక్షించబోమని.. వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇక ఎవ్వరైనా కులాలు, మతాల మధ్య విద్వేషాలు పెంచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కటకటాల పాలు కాకతప్పదని ఏపీ సర్కార్ తరుఫున డీజీపీ హెచ్చరికలు జారీ చేశారు.
ఇక తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో విగ్రహాల ధ్వంసం జరిగిందంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంపై ఏపీ సర్కార్ భగ్గుమంది. ఇది అసత్యమని ఈ ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ డీజీపీ తెలిపారు.
Also Read: మరీ ఇంత అన్యాయమా.. పాపం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ !
తాజాగా దేవాలయాల్లో దొంగతనాలు, దాడులపై బుధవారం ఒక్కరోజే ఏపీ సర్కార్ 5 కేసులను చేధించి కేసులు పెట్టింది. అంతర్వేది సహా రాష్ట్రంలో జరిగిన ఈ తరహా హిందుత్వ నేరాలకు సంబంధించి 33 కేసుల్లో 27 చేధించారు. మూడు అంతర్రాష్ట్ర ముఠాలను అరెస్ట్ చేశారు. 76 కేసుల్లో 178మందిని అరెస్ట్ చేశారు.
ఇలా హిందుత్వ దాడుల విషయంలో జగన్ సర్కార్ చాలా సీరియస్ గా దృష్టి సారించినట్లు అర్థమవుతోంది.